సభ్యసమాజం సిగ్గుతో.. మణిపూర్ ఘటనపై బీజేపీ నేత విజయశాంతి ఎమన్నారంటే..?
Manipur violence: మణిపూర్ లో ఇద్దరు మహిళలను లైంగికంగా వేధింపులకు గురిచేసి, వారిని నగ్నంగా ఊరేగించిన ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు వెలుగులోకి రావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. రెండు నెలలకు పైగా మణిపూర్ జాతి ఘర్షణలతో మండిపోతున్నదనీ, దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడాలనీ, పార్లమెంట్ లో చర్చ జరగాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
BJP leader Vijayashanti: మణిపూర్ జాతి ఘర్షణలతో అట్టుడుకుతోంది. కూకీ, మైతీ కమ్యూనిటీ వర్గాల మధ్య కొనసాగుతున్న హింసాత్మక ఘర్షణలో ఇప్పటివరకు వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. అనేక ఇండ్లు, ఆస్తులు బూడిదయ్యాయి. చాలా మంది రాష్ట్రం విడిచి వెళ్లిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇదే సమయంలో మణిపూర్ లో ఇద్దరు మహిళలను లైంగికంగా వేధింపులకు గురిచేసి, వారిని నగ్నంగా ఊరేగించిన ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు వెలుగులోకి రావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. రెండు నెలలకు పైగా మణిపూర్ జాతి ఘర్షణలతో మండిపోతున్నదనీ, దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడాలనీ, పార్లమెంట్ లో చర్చ జరగాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి.. సామూహిక అత్యాచారం చేసిన ఘటనపై తెలంగాణ బీజేపీ లీడర్ విజయశాంతి స్పందించారు. మణిపూర్ హింస ఆందోళనకరమని అన్నారు. సభ్య సమాజం సిగ్గుతో బాధపడుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడుతూ.. అత్యాచారం చేసిన ఘటనలో పాల్గొన్న నేరస్థులను ఉరితీయాలని డిమాండ్ చేశారు.
ట్విట్టర్ వేదికగా విజయశాంతి స్పందిస్తూ.. "మణిపూర్‌లో జరుగుతున్న సంఘటనలు యావత్ దేశాన్ని త్రీవ్ర వేదనకు గురిచేస్తున్నాయి. సభ్యసమాజం సిగ్గుతో బాధపడుతున్నది. పై చర్యలో పాల్గొన్న నేరస్థులు ఉరితీసి శిక్షించబడాలని కోరుకుంటున్నాను" అని పేర్కొన్నారు.
ఇదిలావుండగా, మణిపూర్ అంశంపై బీజేపీ నేత కిషన్ రెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపాయి. హింసాత్మక ప్రభావిత మణిపూర్ పరిస్థితితో తమ మంత్రిత్వ శాఖకు ఎటువంటి సంబంధం లేదనీ, శాంతిభద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశమని, అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి శనివారం అన్నారు. వైరల్ అయిన వీడియో క్లిప్ లో, మణిపూర్ లో కుకి తెగకు చెందిన ఇద్దరు మహిళలను ఒక గుంపు నగ్నంగా ఊరేగించిన షాకింగ్ విజువల్స్ పై స్పందించమని అడిగినప్పుడు కేంద్ర మంత్రి చిరాకు పడ్డారని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. కిషన్ రెడ్డి మణిపూర్ సమస్యను తన మంత్రిత్వ శాఖ పరిధిలోకి రాని అంశంగా కొట్టిపారేశారు.