న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్‌ నేత, కేంద్రమాజీ మంత్రి బండారు దత్తాత్రేయ హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా ప్రమాణ స్వీకార ప్రమాణం చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రామ సుబ్రహ్మణ్యన్ దత్తాత్రేయతో బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు. 

హిమాలయ సంప్రదాయ టోపీ దరించి గవర్నర్ గా బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయరాం సింగ్ ఠాకూర్, మంత్రులు పాల్గొన్నారు. దత్తాత్రేయకు హిమాచల్ ప్రదేశ్ సీఎం జయరాం సింగ్ ఠాకూర్, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.

ఇకపోతే దత్తాత్రేయ ప్రమాణ స్వీకారానికి తెలంగాణ రాష్ట్రం నుంచి కీలక నేతలు హాజరయ్యారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డా.కె. లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డితోపాటు పలువురు బీజేపీ నేతలు, దత్తాత్రేయ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా దత్తాత్రేయ ప్రమాణం