Asianet News TeluguAsianet News Telugu

టిఆర్ఎస్ సర్కారుపై బిజెపి రావు పద్మ ఫైర్

రైతులకు మొండిచేయి చూపుతున్నారు
bjp rao padma fire on trs government

మన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వమని బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆరోపించారు. శనివారం జిల్లాలోని కమలాపూర్ మండలంలోని మర్రిపెల్లిగూడెంలో నీరు లేక ఎండిపోయిన వరి పంటలను బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ బీజేపీ నాయకులతో పాటు పరిశీలించారు. ఈ సందర్బంగా రావు పద్మ మాట్లాడుతు టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఇది చేస్తా అది చేస్తా అని గొప్పలు చెప్తు కాలం వెళ్లదిస్తుంది తప్పితే వారికి చేసిందేమీ లేదని ఆరోపించారు. ఇక్కడి పరిస్థితి చూస్తుంటే ఆఖరి పంట వరకు నీళ్లు ఇస్తామని చెప్పిన టిఆర్ఎస్ మంత్రులు, నాయకులు, అధికారుల మాటలు విని రైతులు ఎంతో కష్టంతో అప్పు చేసి మరీ వరి పంటను పెడితే ఈరోజున నీళ్లు లేక పంటపొల్లాలని బీటలువారి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్ధిక మంత్రి సొంత మండలంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉందో ఉహించనక్కర్లేదన్నారు.

మిషన్ కాకతీయ ద్వార చేరువులన్ని నింపుతామని, రైతుకు ఆఖరి పంట వరకు సరిపడే నీరు అందిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావులు వాటి ద్వారా వచ్చిన కమిషన్లతో వారి జేబులు నింపుకున్నారని విమర్శించారు.

ఈరోజు రైతుల బాగు కోసం ఏదైనా చేసాము అంటే అది కేవలం నరేంద్రమోడీ నాయకత్వంలో నడుస్తున్న బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ భీమా, ఇ - నర్మ్, భూసార పరీక్ష పధకం, ఇలాంటివి ఎన్నో ఉన్నాయిని తెలియజేసారు.తక్షణమే పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 50 వేల రూపాయల చెప్పున నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రైతులకు న్యాయం జరిగేంత వరకు బీజేపీ వారి వెంట ఉండి పోరాటం చేస్తోంది అని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గురుమూర్తి శివ కుమార్, మండల అధ్యక్షులు సన్నపు కన్నయ్య, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు పుల్యాల రవీందర్, యువమోర్చ జిల్లా అధ్యక్షులు గుండమీది శ్రీనివాస్, కమలపూర్ మండల నాయకులు నగేష్, శోభన్ బాబు, మహాజన్, కవిత, మరిపెల్లిగూడెం గ్రామ అధ్యక్షులు బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios