హైదరాబాద్:మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ బిజెపి తమ ముందు ఉన్న ఆస్త్రాలను వినియోగించుకునేందుకు సిద్ధమవుతోంది.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన సిటిజన్ అమెండ్మెంట్ బిల్లుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ కొంతమంది చేస్తున్న ఆందోళనలను బీజేపీకి తప్పుపడుతుంది. 

హైదరాబాద్ కేంద్రంగా జరిగిన పరిణామాలన్నింటినీ బేరీజు  వేసుకున్న బీజేపీ నేతలు  తమ కార్యాచరణను  కూడా దీని చుట్టూ ఉండేలా చర్యలు చేపట్టారు.

 మున్సిపల్ ఎన్నికల సమయం కావడంతో సిటిజన్ అమెండ్మెంట్ బిల్లుపై గృహ సంపర్క్  అభియాన్ పేరుతో ఇంటింటికి వెళ్లాలని  బిజెపి నేతలు ఓ కార్యక్రమాన్ని తీసుకున్నారు.  

పట్టణ ప్రాంతాల్లో బిజెపికి గతంలో ఉన్న పట్టును నిలబెట్టుకునేందుకు ఇదే అవకాశంగా తెలంగాణా బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. ఇంటింటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన బిల్లుల పై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. 

Also read:వీక్లీ రౌండప్:దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం, కరీంనగర్ కలెక్టర్‌ బదిలీ

మున్సిపల్ ఎన్నికలు కూడా రావడంతో రాజకీయంగా తమకు కలిసి వస్తుందని బిజెపి నేతలు అంచనా వేస్తున్నారు. సీ ఏ ఏ, ఎన్ పి ఆర్, ఎన్ సి ఆర్ అంశాలను ప్రజలకు వివరిస్తే జాతీయ పార్టీగా తమ పార్టీకి రాష్ట్రంలో  పట్టు పెరిగే అవకాశం ఉంటుందని బీజేపీ నేతలు భావిస్తున్న ట్లు తెలుస్తోంది. 

also read:వీక్లీ రౌండప్: మంత్రుల మెడకు మున్సిపల్ ఉచ్చు, కేటీఆర్‌కు సీఎం పదవి?

అవసరమైతే జాతీయ బిజెపి కీలక  నేతలతో హైదరాబాద్ లో  ఓ భారీ సభను ఏర్పాటు చేసే యోచనలో కూడా బిజెపి ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో బిజెపి నేతలు ఇంటికి వెళ్లి సి ఎ ఏ పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

also read:weekly roundup:తెలంగాణకు నెక్స్ట్ సీఎం ఆయనే, మున్సిపోల్స్‌పై దృష్టి

ఎంఐఎం పార్టీ వ్యతిరేకిస్తున్న ఇలాంటి అంశాలపై ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కారాదని దేశ ప్రయోజనాలు,భద్రత కోసమే కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని బీజేపీ నేతలు అంటున్నారు. మొత్తం మీద బీజేపీ నేతలకు ఎన్నికల వేళ కీలకఅస్త్రం ఒకటి చేతికి అంది నట్లయింది.