Asianet News TeluguAsianet News Telugu

weekly roundup:తెలంగాణకు నెక్స్ట్ సీఎం ఆయనే, మున్సిపోల్స్‌పై దృష్టి

తెలంగాణ రాష్ట్రంలో ఈ వారంలో ప్రధాన సంఘటనలు చోటు చేసుకొన్నాయి.

weekly roundup:this week important incidents in telangana state
Author
Hyderabad, First Published Dec 29, 2019, 9:32 AM IST


హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రిజర్వేషన్లు ప్రకటించకుండానే షెడ్యూల్ విడుదల చేయడంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల సంఘంపై మండిపడుతోంది. 

Also read:కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం: మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలనం

మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకొనేందుకు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి.దిశ నిందితుల మృతదేహాలకు ఎట్టకేలకు అంత్యక్రియలు జరిగాయి. తెలంగాణకు కేసీఆర్ తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన ప్రకటన చేశారు. గత వారంలో తెలంగాణలో ప్రధానంగా చోటుచేసుకొన్న ఘటనలివి.

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. జనవరి 7వ తేదీన నోటీఫికేషన్ విడుదల కానుంది. 

అయితే మున్సిపాలిటీలకు రిజర్వేషన్లను ప్రకటించకుండానే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రిజర్వేషన్లు ప్రకటించకుండా ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై ఎలా నిర్ణయిస్తారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.

రిజర్వేషన్లను ప్రకటించకుండానే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంపై కోర్టును ఆశ్రయించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది.కోర్టును ఆశ్రయించాలని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంపై టీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓటమిపై భయంతోనే కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్తామని ప్రకటించిందని టీఆర్ఎస్ నేతలు విమర్శించారు.

అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించేందుకు రిజర్వేషన్లు ప్రకటించకుండానే ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతోంది. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి తమ అభిప్రాయాలను పంచుకొన్నారు.

మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశం ఈ నెల 27వ తేదీన సమావేశం జరిగింది.ఈ సమావేశంలో కోర్ కమిటీ సభ్యులు కాకుండా ఇతరులను కూడ ఆహ్వానించడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 కోర్ కమిటీ సమావేశాన్ని బహిష్కరించారు. ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వి.హనుమంతరావును సమావేశానికి రావాలని ఆహ్వానించారు. కానీ, హనుమంతరావు మాత్రం సమావేశం నుండి బయటకు వచ్చారు.కోర్ కమిటీ సమావేశంలో కూడ కోర్ కమిటీ సభ్యులపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు.

మున్సిపల్ ఎన్నికలపై టీఆర్ఎస్ పై తాను చేసిన విమర్శలపై అధికార పార్టీ చేసిన ప్రతిదాడిపై పార్టీ నేతలు ఎవరూ కూడ స్పందించకపోవడంపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ చేసిన విమర్శలపై ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నలు గుప్పించారు.

సీఏఏ, ఎన్ఆర్‌సీ అంశాలు మున్సిపల్ ఎన్నికల్లో  తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ మేరకు సీఏఏకు వ్యతిరేకంగా ఈ నెల 28వ తేదీన కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు.ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆర్ఎస్ఎస్, ఎంఐఎం సభలకు ఎందుకు అనుమతి ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశ్నించారు.

మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకొంటామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై  టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించారు. మెజారిటీ మున్సిపాలిటీ స్థానాలను కైవసం చేసుకొంటామని కేటీఆర్ ధీమాను వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే తెలంగాణకు కేసీఆర్ తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ క్రియాశీలకంగా వ్యవహరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ తరహాలోనే కేటీఆర్ కూడ వ్యవహరిస్తారని శ్రీనివాస్ గౌడ్ ప్రస్తావించారు. ఇప్పటికే కేటీఆర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. 


ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ శుభవార్త

సమ్మె తర్వాత ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీని తెలంగాణ సీఎం కేసీఆర్ నెరవేర్చారు. ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ విరమణ వయస్సును 58 ఏళ్ల నుండి 60 ఏళ్లకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.  

సమ్మె తర్వాత ఆర్టీసీ కార్మికులతో నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ మేరకు హామీ ఇచ్చారు.ఈ హామీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

మరోవైపు ఆర్టీసీ కార్మికులకు విధులు మారే సమయంలో సౌకర్యాలను అమలు చేసింది.ఈ మేరకు సంచార టాయిలెట్లను కూడ ఆర్టీసీ కార్మికులకు ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. మరో వైపు ఆర్టీసీని ఏపీ రాష్ట్రంలో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఆర్టీసీ కార్మికుల పట్ల యాజమాన్యం వేధింపులకు గురి చేస్తోందని టీఎంయూ నేత ఆశ్వత్థామరెడ్డి విమర్శలు గుప్పించారు.


ఎట్టకేలకు దిశ నిందితుల అంత్యక్రియలు

దిశ నిందితుల అంత్యక్రియలు ఈ నెల 23వ తేదీన స్వగ్రామాల్లో జరిగాయి. ఈ నెల 23వ తేదీన దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించింది.హైకోర్టు  ఆదేశాల మేరకు ఈ నెల 23వ తేదీన ఎయిమ్స్ వైద్యులు రీపోస్టుమార్టం నిర్వహించారు.

రీ పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక హైకోర్టుకు చేరింది.దిశ నిందితులకు రీ పోస్టుమార్టం పూర్తైన తర్వాత కుటుంబసభ్యులకు అప్పగించారు గాంధీ వైద్యులు. కుటుంబసభ్యులు అదే రోజు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ నెల 26వ తేదీ రాత్రి నారాయణపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దిశ కేసు నిందితుడు చెన్నకేశవులు తండ్రి కుర్మయ్యకు గాయాలయ్యాయి. నిమ్స్ ఆసుపత్రిలో కుర్మయ్యకు శస్త్రచికిత్స నిర్వహించారు.

Follow Us:
Download App:
  • android
  • ios