లూటీ చేయడం, అమ్మడమే బీజేపీ లక్ష్యం: ఖమ్మం సభలో పంజాబ్ సీఎం భగవంత్ సింగ్
ప్రజలకు ఇచ్చిన హామీలను బీజేపీ సర్కార్ నెరవేర్చలేదని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ చెప్పారు. ఖమ్మం సభ భవిష్యత్తు రాజకీయాలకు మార్పునకు నాందిపలకనుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఖమ్మం: ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేంద్ర ప్రభుత్వం భారతీయ జుమ్లా పార్టీగా మారిందని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ చెప్పారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ యువత, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయలదేన్నారు. ప్రతి ఏటా రెండు కోట్ల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని మోడీ హామీ ఇచ్చారన్నారు. కానీ రెండు కోట్ల ఉద్యోగులు ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ఇచ్చిందన్నారు. కానీ రైతుల ఆదాయం రెట్టింపు కాలేదన్నారు. కేంద్రం విధానాల కారణంగా దేశం ఎటువైపు వెళ్తోందోననే ఆందోళన నెలకొందన్నారు.
నల్ల ధనం విదేశాల నుండి తీసుకు వచ్చి పేదల బ్యాంకు ఖాతాల్లో రూ. 15 లక్షలు జమ చేస్తామని మోడీ మామీ ఇచ్చారన్నారు. లూటీ చేయడం , అమ్మడమే బీజీపీ సిద్దాంతమని పంజాబ్ సీఎం విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఎల్ ఐసీ, రైల్వేశాఖలను కేంద్ర ప్రభుత్వం కారు చౌకగా విక్రయించే ప్రయత్నం చేస్తుందని భగవంత్ సింగ్ మాన్ చెప్పారు.
తెలంగాణ సర్కార్ తీసుకువచ్చిన కంటి వెలుగు వంటి పథకం చాలా మంచిదన్నారు. పంజాబ్ రాష్ట్రంలో కూడా తెలంగాణలో అమలౌతున్న పథకాలను ప్రవేశపెడుతామన్నారు. మంచి కార్యక్రమాలు ఎక్కడనుండైనా నేర్చుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అభివృద్దిలో తెలంగాణ దూసుకు పోతుందని ఆయన చెప్పారు. ఖమ్మం సభకు భారీ ఎత్తున ప్రజలు హాజరు కావడం ప్రజల్లో వస్తున్న మార్పునకు సంకేతంగా ఆయన పేర్కొన్నారు.
also read:బీజేపీని తరిమికొట్టే కార్యక్రమం తెలంగాణ నుండే ప్రారంభం కావాలి: ఖమ్మం సభలో అఖిలేష్ యాదవ్
కొన్ని రాష్ట్రాల్లో కొనుగోళ్లతో అధికారం చేజిక్కించుకొనేందుకు బీజేపీ కుట్ర చేసిందన్నారు. ఢిల్లీ మున్సిఫల్ ఎన్నికల్లో కూడా ఇదే తరహలో కుట్రలు చేశారని ఆయన ఆరోపించారు.పంజాబ్ రాష్ట్రంలో ఆప్ పార్టీకి ప్రజలు ఘన విజయం అందించారని భగవంత్ సింగ్ మాన్ చెప్పారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా అనేక కుట్రలు చేసినా కూడా ప్రజలు ఆప్ నకు పట్టం కట్టారన్నారు. పంజాబ్ లో అవినీతిని రూపుమాపుతామని ఆయన చెప్పారు.