పోడు భూముల్లో మొక్కలు నాటితే పీకేయండి అంటూ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు బీజేపీ నేత సోయం బాపూరావు. ఆదివాసీల బాధలు స్వయంగా అనుభవించాను కాబట్టే ఈ వ్యాఖ్యలు చేశానని స్పష్టం చేశారు.

పోడు భూముల జోలి కొస్తే మరోసారి ఇంద్రవెల్లి పోరాటం చేస్తామన్నారు. అడవుల్లోకి అధికారులొస్తే.. ఆదివాసీలంతా రోడ్లపైకొస్తారని సోయం హెచ్చరించారు. హరితహారం పేరుతో మొక్కలు నాటితే పీకేయాలని ఆయన పిలుపునిచ్చారు.

అధికారులకు అడవుల్లోకి వెళ్లే అధికారం లేదని... ఆదివాసీలను నిరాశ్రయులను చేస్తే ఊరుకోనన్నారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ధర్నా చేస్తానని సోయం స్పష్టం చేశారు. ఢిల్లీలో ధర్నాకు మోడీ లేదా అమిత్ షాను ఆహ్వానిస్తానని సోయం బాపూరావు తెలిపారు.