గతకొన్ని రోజులుగా బీజెపి రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నరసింహారావు తెలుగుదేశం పార్టీ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టిడిపి నాయకుడు సీఎం రమేష్ ను టార్గెట్‌గా చేసుకుని అతడిపై ఇటీవల జరిగిన ఐటీ సోదాలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అయితే తాజాగా జీవిఎల్ తెలంగాణ కాంగ్రెస్ నాయకులపై విమర్శలు చేశారు.

 కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి అసలు స్వరూపం ఐటీ దాడుల ద్వారా బైటపడిందని జీవిఎల్ అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రేవంత్‌ భూదందాలు, అక్రమాలకు పాల్పడ్డారని జీవీఎల్‌ విమర్శించారు. ఐటీ దాడుల్లో ఏమీ దొరకలేదని రేవంత్ తనకు తానే సర్టిఫికేట్ ఇచ్చుకున్నాడని అన్నారు. ఐటీ రిపోర్టు చూస్తుంటే కొంత సమాచారమే బైటికి వచ్చినట్లు తెలుస్తోందని...మిగతా సమాచారం బైటికి వస్తే ఎవరేంటో తెలుస్తుందన్నారు. రేవంత్ ఓ రాజకీయ నాయకుడిగా కాకుండా భూమాఫియా నడిపేవారిగా కనిపిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

తెలంగాణ కాంగ్రెస్ తరపున అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. అయితే ఈ ప్రచారంకోసం తెలంగాణకు రాహుల్ చేపడుతున్న పర్యటనపై జీవిఎల్ స్పందించారు. రాహుల్‌ గాంధీపై భూ కబ్జాల విషయంలో రేవంత్‌రెడ్డి దగ్గర కోచింగ్‌ క్లాసులు తీసుకుంటారేమోనని జీవిఎల్ ఎద్దేవా చేశారు. నేషనల్‌ హెరాల్డ్‌ సంస్థకు ఇచ్చిన భూముల్లో అక్రమాలు జరిగాయని జీవీఎల్ ఆరోపించారు.

 తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్‌‌కుమార్‌ రెడ్డి కూడా కనిపించేంత ఉత్తముడేమీ కాదని జీవిఎల్ అన్నారు. తెలంగాణ ప్రజలకు ఉత్తమ్‌ క్షమాపణ చెప్పాలని జీవిఎల్ డిమాండ్ చేశారు. 

మరిన్ని వార్తలు

తెలంగాణలో నాలుగు రోజుల్లోనే ఎన్నికలు: జీవిఎల్