ఆరు గ్యారంటీలను కాకి ఎత్తుకెళ్లనుంది...: బండి సంజయ్ సెటైర్లు

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారంటీల అమలు త్వరలోనే ఆగిపోనుందని బిజెపి ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఇది తెెలిసే కాంగ్రెస్ ఇప్పుడు హడావిడి చేస్తోందన్నారు. అసలు ఎందురు ఆరు గ్యాంరటీలు ఆగిపోనున్నాయంటే...

BJP MP Bandi Sajnay satires on Congress six guarantees AKP

కరీంనగర్ : తెలంగాణ ప్రభుత్వం లోక్ సభ ఎన్నికల కోసమే మరోసారి ఆరు గ్యారంటీల అమలు పేరిట హడావిడి చేస్తోందని బిజెపి ఎంపి బండి సంజయ్ ఆరోపించారు. మరో పదిరోజుల్లో ఎన్నికల కోడ్ రానుంది... దీంతో ఆరు గ్యారంటీలను అటకెక్కించి కాకి ఎత్తుకెళ్లిందని చెబుతారని ఎద్దేవా చేసారు. సరగ్గా హామీలను అమలు చేయాలనుకున్న సమయంలో ఎలక్షన్ కోడ్ వచ్చిందని... తమను గెలిపిస్తేనే గ్యారంటీలైనా, పథకాలైనా వస్తాయని తెలంగాణ ప్రజలను మభ్యపెట్టనున్నారని అన్నారు. ఎన్నికల కోసం కాకమ్మ కథలు చెప్పి ఆ తర్వాత పట్టించుకోరు... కాబట్టి తెలంగాణ ప్రజలు మరోసారి కాంగ్రెస్ ను నమ్మి మోసపోవద్దని బండి సంజయ్ సూచించారు. 

ప్రజాహిత యాత్రలో భాగంగా సంజయ్ హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో జమ్మికుంటలో వుండగా బిజెపి లోక్ సభ అభ్యర్థుల ప్రకటన వెలువడింది. ఇందులో తిరిగి కరీంనగర్ సీటు తనకే కేటాయించడంపై సంజయ్ ఆనందం వ్యక్తం చేసారు. జమ్మికుంటలో అడుగుపెట్టగానే ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. మరోసారి కరీంనగర్ ప్రజలకేు సేవ చేసుకునే అవకాశం వచ్చిందని... వారి రుణం తీర్చుకుంటానని అన్నారు. కేంద్రం నుండి భారీగా నిధులు తీసుకువచ్చి కరీంనగర్ పార్లమెంట్ ను అభివృద్ది చేస్తాను... ఇక్కడి ప్రజలు తలెత్తుకు తిరిగేలా పనిచేస్తానన్నారు. తనను మరోసారి ఆదరించి భారీ మెజారిటీ గెలిపించాలని సంజయ్ కోరారు. 

ఇక కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని... అందువల్లే ఆరు గ్యారంటీల గురించి ప్రధాన ప్రతిపక్షం నోరు మెదపడం లేదన్నారు. గత పదేళ్లలో చేసిన అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు బిఆర్ఎస్ కాంగ్రెస్ తో కలిసిపోయిందన్నారు. ఈ రెండు పార్టీలను ఎదిరించే సత్తా బిజెపికే వుందని... లోక్ సభ ఎన్నికల్లో తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు. 

Kishan Reddy: "దేశానికి మళ్లీ మోదీ నాయకత్వం అవసరం"

లోక్ సభ ఎన్నికల్లో బిజెపి గెలిస్తే మళ్లీ నరేంద్ర మోదీ ప్రధాని అవుతారు... మరి కాంగ్రెస్ గెలిస్తే  ప్రధాని ఎవరు? రాహుల్ గాంధీయే తమ ప్రధాని అభ్యర్థి అని ప్రకటించే దమ్ముందా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష ఇండియా కూటమే రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తోంది... అలాంటిది ప్రజలు ఆయనను నమ్ముతారా? అన్నారు. మళ్ళీ ప్రధానిగా మోదీ కావాలంటూ బిజెపిని గెలిపించాలని సంజయ్ సూచించారు.

తెలంగాణ ప్రజల సొత్తును కేసీఆర్ దోచుకున్నాడు... కేవలం ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరిటే లక్ష కోట్లు స్వాహా చేసాడని సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ అవినీతి కళ్లముందే కనిపిస్తున్నా ఆయనపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలెందుకు తీసుకోవడం లేదు... జైల్లో ఎందుకు వేయడంలేదని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి గెలిచి అధికారంలోకి వచ్చివుంటే ఖచ్చితంగా కేసీఆర్ ను జైల్లో పెట్టేవాళ్లమని బండి సంజయ్ తెలిపారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios