జమ్ము కశ్మీర్‌‌లో భారత సైనికులపై పాకిస్ధాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ మాణవబాంబుతో తెగబడిని మారణహోమాన్ని సృష్టించారు. 45 మంది భారత జవాన్లను పొట్టన పెట్టుకున్నారు. ఈ దుర్ఘటన  కారణంగా యావత్ దేశం దు:ఖంలో మునిగిపోయిన సమయంలో టెన్నిస్ క్రాడాకారిణి సానియా మీర్జా  సోషల్ మీడియాలో ఫ్యాషన్ డిజైనింగ్ డ్రెస్సులె ధరించి దిగిన తన ఫోటోలను పోస్ట్ చేసింది. దీంతో అప్పటినుండి ఆమెపై నెటిజన్లు అదే సోషల్ మీడియా వేదిలపై ఫైర్ అవుతున్నారు. 

తాజాగా బిజెపి నాయకులు కూడా సానియా మీర్జా వ్యవహారశైలిపై విమర్శలకు దిగుతున్నారు. దైశ సైనికులంటే గౌరవం లేని సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించాలని బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రభుత్వానికి సూచించారు. సానియా ఎప్పుడూ పాకిస్థాన్ కోడలి మాదిరిగానే వ్యవహరిస్తుంది తప్ప భారత దేశ పౌరురాలిగా ఎప్పుడూ వ్యవహరించలేదని అన్నారు. తాజాగా మన దేశ సైనికులపై  జరిగిన అమానుష ఘటనపై కూడా సానియా పాకిస్థాన్ కు మద్దతిచ్చేలా వ్యవహరిస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. 

ఆమెకంటే మెరుగైన క్రీడాకారులు తెలంగాణలో వున్నారని రాజాసింగ్ అన్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, పివి.సింధులు కూడా తెలంగాణ బిడ్డలేనని...వారు దేశం తరపున ఆడుతూ ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించారని గుర్తుచేశారు. అలాంటి వారిని ఎవరినైనా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తే బావుంటుందని రాజాసింగ్ సీఎం కేసీఆర్ కు సూచించారు.