Asianet News TeluguAsianet News Telugu

యోగి ఆదిత్యనాథ్ కు ఓటేయకపోతే జేసీబీలు, బుల్డోజర్లతో తొక్కిస్తాం.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పదం...

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి నోరు పారేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కు ఓటు వేయకపోతే జేసీబీలు, బుల్డోజర్లతో తొక్కిస్తాం అంటూ ఓ వీడియో విడుదల చేసి వివాదాల్లో చిక్కుకున్నాడు. 

BJP MLA Rajasingh Controversial comments in uttarpradesh assembly elections
Author
Hyderabad, First Published Feb 16, 2022, 9:37 AM IST

హైదరాబాద్ : ‘యూపీలో వేల సంఖ్యలో  JCBs, bulldozerలను యోగి తెప్పించారు. ఎన్నికల తర్వాత Yogi Adityanathకి ఎవరెవరు మద్దతు ఇవ్వలేదో వారిని అన్ని ప్రాంతాల్లో గుర్తిస్తాం. జేసీబీలు, బుల్డోజర్ లు ఎందుకు వస్తాయో మీకు తెలుసు కదా?.. ’ అంటూ BJP MLA Rajasingh మరోసారి Controversial comments చేశారు. యోగి ఆదిత్యానాథ్ ఈ సారి ముఖ్యమంత్రి కాకపోతే మీరు యూపీలో ఉంటారో… రాష్ట్రం విడిచి పారిపోతారో తేల్చుకోండి అని హెచ్చరించారు.

ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేసే వాళ్ళు యూపీ విడిచి వెళ్లక తప్పదని చెప్పారు. యూపీ ఎన్నికల్లో హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చిన ఆయన.. యోగి ఆదిత్యనాథ్ కు ఓటు వేయకుంటే బుల్డోజర్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు రాజాసింగ్ మంగళవారం వీడియో విడుదల చేశారు. మంగళవారం జరిగిన రెండో విడత పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల అత్యధిక పోలింగ్ జరిగింది అని పేర్కొంటూ... యోగిని వ్యతిరేకిస్తున్న వారే ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేసి ఉంటారని భావిస్తున్నట్లు చెప్పారు. మూడో దశ పోలింగ్ లో హిందువులంతా బయటకు రావాలని పిలుపునిచ్చారు.

రాజా సింగ్ ను తక్షణం అరెస్టు చేయాలి…
యూపీలో ఓటర్లను బెదిరిస్తూ రాజాసింగ్ బాహాటంగా వ్యాఖ్యలు చేశారని, అందుకు ఆయనను తక్షణం అరెస్టు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సీఎం కేసీఆర్ రాజాసింగ్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని.. ఈసీ స్పందించాలని విజ్ఞప్తి చేశారు. 

ఇదిలా ఉండగా, ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(AIMIM)  చీఫ్ Asaduddin Owaisi శ్రీరాముని వంశస్థుడని BJP MP బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అన్నారు. ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికల ప్రచారం సందర్భంగా సింగ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు జాతీయ మీడియా తెలిపింది.  ఆయన కుమారుడు ప్రతీక్ భూషణ్ సింగ్  బీజేపీ అభ్యర్థిగా గోండా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

బ్రిజ్ భూషణ్ kaiserganj నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన కుమారుడు ప్రతీక్ విజయం కోసం ఆయన ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓవైసీ తనకు Old friend అని చెప్పారు.తనకు తెలిసినంత వరకు ఆయన క్షత్రియుడు అని తెలిపారు. ఆయన Sri Rama వంశస్థుడు అని ఇరాన్ కు చెందిన వాడు కాదని చెప్పారు. ఓవైసీ పార్టీతో సమాజ్వాది పార్టీ పొత్తు కుదుర్చుకోనందుకు మండిపడ్డారు. Muslimsపై నాయకత్వం కోసం Akhilesh Yadav, ఓవైసీ పోట్లాడుకుంటున్నారు అన్నారు.

ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మోసగాడు అన్నారు. ఆయన తన తండ్రిని, తన అంకుల్ని మోసం చేశాడు అన్నారు. మోసం చేయడమే ఆయన పని అని దుయ్యబట్టారు. బీజేపీకి రాజీనామా చేసి ఎస్ పీలో చేరిన స్వామి ప్రసాద్ మౌర్యాని కూడా మోసం చేశారని ఆరోపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios