హైదరాబాద్: సిద్దిపేటలో నోట్ల కట్టలపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరుతూ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలంగాణ హైకోర్టులో గురువారం నాడు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.సిద్దిపేట పోలిస్ స్టేషన్ లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని ఆయన ఆ పిటిషన్ లో కోరారు.

రఘునందన్ రావు పిటిషన్ జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ వద్దకు వచ్చింది. అయితే ప్రజా ప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసులను సీజే ధర్మాసనం విచారణ జరపాల్సి ఉందని ఆయన సూచించారు. దీంతో ఈ కేసు విచారణను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి బదిలీ చేయాలని హైకోర్టు రిజిస్ట్రీని జస్టిస్ లక్ష్మణ్ ఆదేశించారు.

also read:ఆ డబ్బులతో నాకేం సంబంధం: రఘునందన్ రావు

ఈ ఏడాది అక్టోబర్ 26వ తేదీన సిద్దిపేటలో రఘునందన్ రావు సన్నిహితుడు అంజన్ రావు ఇంట్లో రూ. 18.67 లక్షలు గుర్తించినట్టుగా  పోలీసులు కేసు నమోదు చేశారు.
తన బంధువుల ఇళ్లలో రూ. 18.67 లక్షలు దొరికాయని పోలీసులు కట్టుకథలు అల్లారని ఆయన ఆ పిటిషన్ లో ఆరోపించారు.దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు తీసుకొచ్చారని  పోలీసులు ఆరోపించారు. 

పోలీసులు సీజ్ చేసిన నగదులో రూ. 12.80 లక్షలను పోలీసుల నుండి బీజేపీ కార్యకర్తలు తీసుకెళ్లారు.. ఈ నగదును తీసుకెళ్లని బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.