డిసెంబర్ లో ఎన్నికలు: ఎమ్మెల్యే కిషన్ రెడ్డి

https://static.asianetnews.com/images/authors/5daec891-66fb-5683-ad67-09c295ebe8bb.jpg
First Published 4, Sep 2018, 9:06 PM IST
bjp mla kishaan reddy comments on early elections
Highlights

ముందస్తు ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందని ఆపార్టీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌లో ఎన్నికలు రావొచ్చునని అభిప్రాయపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన ముందస్తు ఎన్నికలు బీజేపీ తలపై పాలు పోసినట్లేనని అన్నారు. పాలమూరు నుంచే బీజేపీ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు. 
 

మహబూబ్‌నగర్‌: ముందస్తు ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందని ఆపార్టీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌లో ఎన్నికలు రావొచ్చునని అభిప్రాయపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన ముందస్తు ఎన్నికలు బీజేపీ తలపై పాలు పోసినట్లేనని అన్నారు. పాలమూరు నుంచే బీజేపీ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు. 

అసోం రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ అమలు చేసిన ప్లాన్‌నే తెలంగాణలో కూడా అమలు చేస్తామన్నారు. ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకించే వారు బీజేపీకి మద్దతు ఇవ్వాలని కిషన్ రెడ్డి పిలుపు ఇచ్చారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెసేతర శక్తులను దగ్గరకు తీసుకుంటామని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ ఎంతో కృషి చేస్తుందని ఆ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. 

loader