Asianet News TeluguAsianet News Telugu

ఎప్పటిలోగా రైతు రుణమాఫీ చేస్తారో సీఎం స్పష్టంగా చెప్పాలి?.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల

రాష్ట్ర ఆవిర్బావం-సాధించిన ప్రగతిపై అసెంబ్లీలో ఆదివారం స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చ సందర్బంగా ఈటల  రాజేందర్ మాట్లాడుతూ.. రైతు రుణమాఫీపై కేసీఆర్ స్పష్టమైన హామీ ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

BJP MLa etela rajender speech in telangana assembly ksm
Author
First Published Aug 6, 2023, 2:04 PM IST

రైతు రుణమాఫీపై కేసీఆర్ స్పష్టమైన హామీ ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆవిర్బావం-సాధించిన ప్రగతిపై అసెంబ్లీలో ఆదివారం స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చ సందర్బంగా ఈటల  రాజేందర్ మాట్లాడుతూ.. రైతు బీమాతో రైతు కుటుంబాలకు కొంతమేర ప్రయోజనం చేకూరుతుంది. అయితే ఎప్పటిలోగా  రైతు రుణమాఫీ చేస్తారనే దానిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 14 ఏళ్లు తెలంగాణ కోసం ఉద్యమం కొట్లాడమని చెప్పారు. ముఖ్యమంత్రి దృష్టిని ప్రజలు, రైతుల మీదకు మళ్లించాలని  కోరారు. 

వర్షాలతో నష్టపోయిన వారికి పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు.  వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. గతత వర్షాలకు నష్టపోయినవారికి ఇప్పటికీ పరిహారం అందజేయలేదని విమర్శించారు. విద్యపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.  రాష్ట్రంలో విద్యాసంస్థలు పెరుగుతున్నాయి.. హాస్టళ్లు తగ్గుతున్నాయని చెప్పారు. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు కట్టలేక పేద విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios