Asianet News TeluguAsianet News Telugu

"సింగరేణి ప్రైవేటీకరణపై చర్చకు రావాలి" : సీఎం కేసీఆర్ కు ఈటల సవాల్

Etala Rajender: సింగరేణి ప్రైవేటీకరణపై తనతో చర్చకు రావాలని బీఆర్ఎస్‌కు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. సింగరేణి లాభాల్లో ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు ఎందుకు బిడ్ చేయలేదో సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్‌ చేశారు. 
 

BJP MLA Etela Rajender Sensational Comments On CM KCR KRJ
Author
First Published Apr 21, 2023, 4:27 PM IST | Last Updated Apr 21, 2023, 4:27 PM IST

సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులకు బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ( Etela Rajender) సవాల్ విసిరారు. సింగరేణి (Singareni) ప్రైవేటీకరణపై తనతో చర్చకు రావాలని పిలుపునిచ్చారు. సింగరేణి లాభాల్లో ఉంటే.. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు ఎందుకు బిడ్ వేయలేదో సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రలో ఉన్న వైజాగ్ స్టీల్ ఫ్లాంట్‌ను కాదు.. తెలంగాణ ప్రజలకు ఉపయోగంగా ఉన్న తెలంగాణ ఆర్టీసీని (RTC) కాపాడాలని హితవుపలికారు. సీఎం కేసీఆర్ పుణ్యాన నాలుగు వేల ఆర్టీసీ బస్సులు ఖతమయ్యాయని విమర్శించారు. మరీ నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు తెరవటం లేదని నిలాదీశారు.  

సీఎం కేసీఆర్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీ నాయకులపై బీఆర్ఎస్ విషం కక్కుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి మైన్స్ ను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం మానుకోవాలని, సింగరేణిని ప్రైవేటీకరణ చేయబోమని ప్రధాని మోడీ రామగుండంలో మాటిచ్చారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ నైనీ బ్లాక్, తాడిచర్ల మైన్స లను ప్రైవేట్ వ్యక్తుల పరం చేశారని ఆరోపించారు.  

రాష్ట్రంలో సమాచార హక్కు సరిగా అమలు కావడం లేదనీ, ఈ చట్టం కేవలం అలంకారప్రాయంగా మారిందని ఎద్దేవా చేశారు. ఆర్టీఐ అధికారులు సమాచారం అందించడంలో విఫలమవుతున్నారనీ, సింగరేణిలో మైన్స్ ప్రైవేటు వ్యక్తుల పరం చేశారని అన్నారు. సింగరేణి సంస్థ బాగుండాలనేదే కేంద్ర ప్రభుత్వ‌ ఆకాంక్ష అని తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ తరహాలో సింగరేణిలోనూ కార్మిక సంఘాలు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ కు చైతన్యపరులు, ప్రశ్నించే వాళ్ళు అన్న, కార్మికులు అన్న ఆయనకు నచ్చదని ఏద్దేవా చేశారు.  

మరోవైపు.. బీజేపీలో చేరికలపై ఈటల రాజేందర్ స్పందిస్తూ.. పొంగులేటి, జూపల్లితో వంద శాతం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. తెలంగాణలో దూసుకెళ్తున్న పార్టీ బీజేపీ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడ రాజకీయ భవిష్యత్ ఉంటే.. ఆ పార్టీలోనే నాయకులు చేరుతారని పేర్కొన్నారు. కేసీఆర్ పై పోరాడేది  బీజేపీనేననీ, తర్వాత ప్రభుత్వంలోకి వచ్చేది బీజేపీనేనని స్పష్టం చేశారు. 

ఇక కాంగ్రెస్-బీఆర్ఎస్ పొత్తు అంటూ వస్తున్న వార్తలపై స్పందించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వేర్వేరు కాదనీ, ఎన్నికల ముందైనా.. తర్వాతైనా రెండు పార్టీలు కలిసే ఉంటాయని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు సీఎం కేసీఆర్ 25కోట్లు పంపించారని సంచలన ఆరోపించారు. పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా అమిత్ షా చేవేళ్ళ సభలో పాల్గొంటారని వెల్లడించారు. దేశంలోని అన్ని పార్టీలకు ఎన్నికల ఖర్చు భరించేంతా వేల కోట్లు ఎలా సంపాదించారో  సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios