Asianet News TeluguAsianet News Telugu

బిజెపి గెలుపుకోసం ఓ సైనికుడిలా పనిచేస్తా..: పార్టీ మార్పు ప్రచారంపై ఈటల క్లారిటీ

బిజెపిని వీడనున్నట్లు జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో పార్టీపై విదేయత ప్రదర్శిస్తూ ఈటల రాజేందర్ కీలక ప్రకటన చేసారు. 

BJP MLA Eatala Rajender given clarity on party changing rumors AKP
Author
First Published Jul 2, 2023, 10:45 AM IST

హైదరాబాద్ : మాజీ మంత్రి, బిజెపి నాయకులు ఈటల రాజేందర్ బిజెపిని వీడనున్నాడంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. బిజెపిలో ఇబ్బందిపడుతున్న ఈటల కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయని తెగ ప్రచారం జరుగుతోంది. అయితే తనకు పార్టీ మారే ఆలోచన లేదని స్వయంగా ఈటలే చెబుతున్నా ప్రచారం మాత్రం ఆగడంలేదు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి తన పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారంపై ఈటల స్పందించారు. 

భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు... సర్పంచ్ నుండి పార్లమెంట్ సభ్యుని వరకు గత నలభై ఏళ్లుగా పార్టీని గెలిపించుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఈటల అన్నారు. అనేక కష్టానష్టాలు, అవమానాలను భరించారు... కొందరు త్యాగాలు కూడా చేసారని ఈటల అన్నారు. ఫలితంగా తెలంగాణలో బిజెపి బలోపేతం అయ్యిందని... ప్రజల ఆశీర్వాదం దొరికే సందర్భం వచ్చిందని ఈటల అన్నారు. 

పదవులు లేకపోయినా కాషాయ జెండా చేతపట్టిన బిజెపి నేతలు పార్టీని అధికారంలో తీసుకురావాలని ఎదురుచూస్తున్నారని ఈటల పేర్కొన్నారు. కళ్లలో ఒత్తులు వేసుకుని మరీ బిజెపి ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో కూడా మోదీ నాయకత్వంలోని బిజెపిని గెలిపించుకుందామని... ఇందుకోసం ఓ సైనికుడిలా పనిచేస్తానని ఈటల అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో బిజెపి  ఆశలు సఫలం అవుతాయని ఎమ్మెల్యే ఈటల పేర్కొన్నారు. 

Read More  జాగ్రత్తగా మాట్లాడాలి: జితేందర్ రెడ్డికి ఈటల కౌంటర్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పెరిగిన జోష్, తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ పై వ్యతిరేకత ఎమ్మెనేపథ్యంలో హుజురాబాద్ ల్యే ఈటల మారనున్నారంటూ ప్రచారం జోరందుకుంది.  జరుగుతోంది. ఇటీవల డిల్లీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తో పాటు ఈటలను పిలుచుకుని కేంద్ర మంత్రి అమిత్ షా భేటీకావడంతో అనుమానాలు మరింత పెరిగాయి. వీరు పార్టీ మారే ఆలోచనలో వున్నందుకే అమిత్ షా బుజ్జగించే ప్రయత్నం చేసారని ప్రచారం జరుగుతోంది. 

అయితే బిజెపిని వీడే ఆలోచనేది తనకు లేదని... తాను పూటకో పార్టీ మార్చేరకం కాదని ఈటల చెబుతున్నా ప్రచారం మాత్రం ఆగడంలేదు.తనలాంటి వారిని పదేపదే పార్టీమార్పుపై ప్రశ్నించవద్దని మీడియా ప్రతినిధులకు ఇటీవల ఈటల సూచించారు. పార్టీలు మారడమంటే బట్టలు మార్చినంత ఈజీ కాదని అన్నారు. తాను బిజెపిలోనే కొనసాగుతానని ఈటల స్పష్టం చేసారు. 

తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాసంస్థల ద్వారా హైప్ క్రియెట్ చేసుకుందని... ఇలాంటి ప్రచారాలతో పార్టీ పెరగదని ఈటల అన్నారు. తొందరగా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ఆత్రుతతో ఉన్నట్టుందని అన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బిఆర్ఎస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వున్నమాట వాస్తమేనని ఈటల అన్నారు. ఈ వ్యతిరేకతను ఎవరు సొమ్ముచేసుకుంటారో చూడాలన్నారు. ఒక్కటి మాత్రం నిజం... ప్రజలు బిఆర్ఎస్ ను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో నమ్మబోరని ఈటల అన్నారు. 
 


 

Follow Us:
Download App:
  • android
  • ios