సరూర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో హత్యకు గురైన నాగరాజు కుటుంబాన్ని ఆదుకోనేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను కోరారు.
హైదరాబాద్: Saroornagar మున్సిపాలీటీ సమీపంలో హత్యకు గురైన Ngaraju కుటుంబాన్ని ఆదుకోవాలని BJP నేతలు ఆదివారం నాడు తెలంగాణ గవర్నర్ Tamilisai Soundararajan కు వినతి పత్రం సమర్పించారు. నాగరాజు కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా కోరారు. నాగరాజు హత్య పై ప్రభుత్వం సరిగా స్పందించడం లేదని కూడా బీజేపీ నేతలు ఆరోపించారు.
బీజేపీకి చెందిన నేతలు ఇవాళ రాజ్ భవన్ లో Governor తమిళిసై సౌందర రాజన్ తో భేటీ అయ్యారు.నాగరాజు హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.అంతేకాదు బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుండి పరిహారం కూడా ఇప్పిచాలని కోరారు.ఇదిలా ఉంటే నాగరాజు హత్య ఘటనపై రెండు రోజుల క్రితమే రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రభుత్వాన్ని నివేదిక కోరిన విషయం తెలిసిందే.
ఈ నెల 4వ తేదీన సరూర్‌నగర్ మున్సిపాలిటీకి సమీపంలో నాగరాజును అతని భార్య సోదరులే హత్య చేశారు. ఈ ఏడాది జనవరి 31న ఆశ్రీన్ సుల్తానా, నాగరాజులు ఆర్య సమాజ్ లో marriage చేసుకున్నారు. ఈ వివాహం ఆశ్రీన్ సోదరులకు నచ్చలేదు.దీంతో నాగరాజున ఎప్పటికైనా చంపేయాలని ప్లాన్ చేశారు. ఓ కార్ల కంపెనీలో నాగరాజు సేల్స్ మేన్ గా పనిచేస్తున్నాడు. నాగరాజు కదలికలపై నిఘా ఏర్పాటు చేసిన ఆశ్రిన్ సోదరులు ఈ నెల 4వ తేదీన నాగరాజుపై దాడి చేసి హత్య చేశారు.నాగరాజును హత్య చేసిన ఆశ్రీన్ ఇద్దరు సోదరులను పోలీసులు మూడు రోజుల క్రితం అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.
వికారాబాద్ జిల్లా మర్పల్లికి చెందిన మొబిన్ అహ్మద్ సోదరి ఆశ్రిన్‌తో నాగరాజుకు చిన్నతనం నుంచే ప్రేమ వ్యవహారం నడుస్తోంది. స్కూల్ నుంచి కాలేజ్ వరకు కలిసి చదువుకుంటూ తమ ప్రేమ వ్యవహారాన్ని వీరు కొనసాగించారు. అయితే తొలి నుంచి అమ్మాయి కుటుంబ సభ్యులు వీరి ప్రేమను అంగీకరించలేదని పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 30వ తేదీన ఆశ్రినా ఇంటి నుంచి పారిపోయింది. దీనికి సంబంధించి అమ్మాయి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని సంప్రీత్ సింగ్ వెల్లడించారు. ఇద్దరూ మేజర్లు కావడంతో పెళ్లి చేసుకున్నారని చెప్పారు. దీనిపై మొబిన్ అహ్మద్ కక్ష పెంచుకున్నారు. అప్పటి నుంచి నాగరాజును చంపేందుకు అతను ప్లాన్ చేస్తూ వచ్చాడని డీసీపీ వెల్లడించారు. ఈ క్రమంలో మొబిన్ తన స్నేహితుడి సహకారంతో నాగరాజు దంపతులను ఫాలో చేస్తూ వచ్చారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి సరూర్‌నగర్ చెరువు కట్ట వద్ద నాగరాజు దంపతులపై దాడి చేశారు.ఐరన్ రాడ్‌తో కొట్టి కత్తితో దాడి చేయడంతో నాగరాజు చనిపోయాడు.
నాగరాజు హత్యపై ఎంఐఎం చీఫ్ అసదుద్దన్ ఓవైసీ కూడా స్పందించారు. నాగరాజు హత్యను తీవ్రంగా ఖండించారు. ఆశ్రిన్ సుల్తానా నాగరాజును ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకొందన్నారు.సూల్తానా సోదరుడు నాగరాజును హత్య చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.ర్జాయంగం ప్రకారమైనా, ఇస్లాం ప్రకారమైనా ఓ వ్యక్తిని చంపడం నేరమేనని ఆయన అన్నారు.బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నాగరాజు హత్యపై స్పందించినాలి డిమాండ్ పై అసద్ ఈ వ్యాఖ్యలు చేశారు.
