కాస్టింగ్ కౌచ్ పై వ్యాఖ్యలు: కష్టాల్లో రేణుకా చౌదరి

కాస్టింగ్ కౌచ్ పై వ్యాఖ్యలు: కష్టాల్లో రేణుకా చౌదరి

న్యూఢిల్లీ: కాస్టింగ్ కౌచ్ పై వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెసు నేత రేణుకా చౌదరి కష్టాల్లో పడే సూచనలు కనిపిస్తున్నాయి. పార్లమెంటు కూడా కాస్టింగ్ కౌచ్ కు అతీతం కాదని ఆమె వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 

ఆమె చేసిన వ్యాఖ్యలపై దుమారం మరింత చెలరేగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్ణాటకకు చెందిన బిజెపి పార్లమెంటు సభ్యులు కొందరు ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నారు. 

ఆ వ్యాఖ్యలపై రేణుకా చౌదరిపై సభా హక్కుల తీర్మానానికి నోటీసు ఇవ్వడానికి వారు సిద్ధపడుతున్నట్లు సమాచారం. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లోనూ ఆమె వ్యాఖ్యలను ప్రచారాస్త్రంగా వాడుకోవడానికి బిజెపి సిద్ధపడుతోంది. ఆ వ్యాఖ్యలను మరింత వివాదాస్పదం చేయడం ద్వారా బిజెపి ఎన్నికల్లో తమకు అనుకూలంగా మలుచుకోవాలని ఆలోచిస్తోంది.

కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం చిత్రసీమకే పరిమితం కాలేదని, అది అన్ని చోట్లా ఉందని రేణుకా చౌదరి అన్న విషయం తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ పై బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు స్పందిస్తూ ఆమె ఆ వ్యాఖ్యలున చేశారు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos