తెలంగాణ ఎన్నికల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోను ప్రకటించింది. కాంగ్రెస్, టీఆర్ఎస్‌లకు ధీటుగా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రజాకర్షక పథకాలకు బీజేపీ ఇందులో స్థానం కల్పించింది..

రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, ఇల్లు లేని పేదలకు ఉచితంగా ఇళ్లు నిర్మిస్తామని, కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం చేసి సాగునీరు అందిస్తామని, గోదావరి జలాల సద్వినియోగానికి 9 బ్యారేజీలు నిర్మిస్తామని, మూడు నెలల్లో 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని తెలిపారు.

యువతపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించిన భాజపా విద్యార్థులకు విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు, కాలేజీ విద్యార్థులకు స్కూటీలిస్తామని, డిగ్రీ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్ లు సమకూరుస్తామని హామీలను తమ మేనిఫెస్టోలో ప్రకటించింది.