దుబ్బాక:దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న కౌంటింగ్ సమయంలో పట్టణ ప్రాంతాల ఓటర్లు కొంత బీజేపీ వైపు మొగ్గు చూపినట్టుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

also read:దుబ్బాక బైపోల్: బీజేపీ ఆధిక్యంపై రామ్‌ మాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

దుబ్బాక అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా బరిలో ఉన్న రఘునందన్ రావు ఇదే స్థానం నుండి ఆయన పోటీ చేయడం ఇది మూడోసారి.దుబ్బాక ఓట్ల లెక్కింపులో ఐదు రౌండ్ల వరకు బీజేపీకి అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశం ఉందని టీఆర్ఎస్ నేతలు అభిప్రాయంతో ఉన్నారు. 

also read:దుబ్బాక ఫలితం: టీఆర్ఎస్ ఎంపీ స్వగ్రామంలో బిజెపి పాగా

ఈ నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి.  పట్టణ ప్రాంతాల ఓటర్లు  బీజేపీ వైపు మొగ్గు చూపినట్టుగా ఫలితాలను చూస్తే అభిప్రాయంతో ఉంది.మొదటి రౌండ్ నుండి  నాలుగు రౌండ్ల వరకు బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు ఆధిక్యంలో ఉన్నారు. 

గ్రామీణ ఓటర్లపైనే టీఆర్ఎస్ ఆశలు పెట్టుకొంది. ఈ నియోజకవర్గం నుండి పలు దఫాలు ప్రాతినిథ్యం వహించిన చెరుకు ముత్యం రెడ్డి  తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో నిలిచారు.  ముత్యం రెడ్డి తనయుడిగా శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో ఉన్నా కూడ ఆశించిన మేరకు ప్రభావం చూపించలేకపోయారు.

టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటాపోటీగా ఓట్లు దక్కాయి. కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి  ఆశించిన ఓట్లు రాలేదు.దుబ్బాక టౌన్ తో పాటు దుబ్బాక మండలంలో కూడ బీజేపీకి అనుకూలంగా ఓట్లు రావడం బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహన్ని నింపాయి.

దుబ్బాక, మిరుదొడ్డి మండలాల్లో బీజేపీకి ఆధిక్యత వచ్చే అవకాశం ఉందని  టీఆర్ఎస్ నేతలు అంతర్గతంగా నిర్వహించుకొన్న సర్వేల్లో తేలింది. అయితే ఈ సర్వేలో వచ్చిన ఆధిక్యత కంటే బీజేపీ ఆధిక్యాన్ని తగ్గించినట్టుగా  టీఆర్ఎస్ నేతలు అభిప్రాయంతో ఉన్నారు.

2018 ఎన్నికల్లో దుబ్బాక పట్టణంతో పాటు దుబ్బాక మండలంలో టీఆర్ఎస్ కు భారీ ఆధిక్యాన్ని సాధించింది. కానీ ఉప ఎన్నికల్లో మాత్రం గతానికి భిన్నంగా ఫలితాలు రావడం బీజేపీకి అనుకూలంగా రావడం టీఆర్ఎస్ కు మింగుడు పడడం లేదు.