ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది. బీజేపీ నేతలు బుధవారం నాడు రాజ్ భవన్ లో తమిళిసై సౌందర రాజన్ తో భేటీ అయ్యారు.

హైదరాబాద్: Khammamలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్యపై CBI విచారణ జరిపించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.ఈ విషయమై చొరవ చూపాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను బీజేపీ నేతలు కోరారు. బుధవారం నాడు ఉదయం రాజ్ భవన్ లో గవర్నర్ Tamilisai Soundararajan తో BJP నేతలు డిమాండ్ చేశారు.ఈ మేరకు బీజేపీ నేతలు గవర్నర్ కు వినతిపత్రం సమర్పించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

సాయి గణేష్ ఆత్మహత్య విషయమై బీజేపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay మల్దకల్ లో ప్రజా సంగ్రామ యాత్ర శిభిరం వద్దే నిరసనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల బీజేపీ శ్రేణులు నిరసనలకు దిగాయి. 

ఈ నెల 14వ తేదీన ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ ముందు పురుగుల మందు తాగిన సాయి గణేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 16న మరణించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందే సమయంలో సాయి గణేష్ మీడియాతో మాట్లాడారు. తనపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 16 కేసులు నమోదు చేయించారన్నారు. అంతేకాదు తనపై రౌడీషీట్ కూడా ఓపెన్ చేయించారన్నారు.ఈ వేధింపులు భరించలేకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టుగా చెప్పారు. అయితే సాయి గణేష్ నుండి పోలీసులు మరణ వాంగ్మూలం తీసుకోలేదు. సాయి గణేష్ మరణించడంతో ఆసుపత్రిపై బీజేపీ కార్యకర్తలు దాడికి దిగారు. మరో వైపు మంత్రి కేటీఆర్ టూర్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా ధ్వంసం చేశారు. 

సాయి గణేష్ ఆత్మహత్యకు కారణమైన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై కేసు నమోదు చేయాలన్నారు. అంతేకాదు మంత్రి అజయ్ ను భర్తరఫ్ చేయాలని కూడా డిమాండ్ చేశారు.