తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చేసిన  తప్పులే మళ్లీ లోక్ సభ ఎన్నికల్లో కూడా పునరావృతం అవుతున్నట్లు బిజెపి జాతీయాధ్యక్షులు లక్ష్మణ్ ఆరోపించారు. తెలంగాణలో బోగస్ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, డబుల్ ఓట్ల ఇంకా చాలా వున్నాయని...వెంటనే వీటిపై చర్యలు తీసుకోవాలని బిజెపి నాయకులు తెలంగాణ ఎన్నికల సంఘం అధికారి రజత్ కుమార్ ను కలిశారు. తెలంగాణ బిజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచందర్ రావు లతో కూడిన ఓ బృందం ఇవాళ సీఈసిని కలిసింది.

గత ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై బీఎల్‌వో లతో సహా ఎవరిని బాధ్యులను చేయకపోవడం ఏంటని రజత్ కుమార్ ను ప్రశ్నించినట్లు లక్ష్మణ్ తెలిపారు. గతేడాది డిసెంబరులో బోగస్ ఓట్ల సమాచారం అందించినా ఈసీ ఇంతవరకు కనీసం విచారణ చెయ్యలేదని అన్నారు. ఓటర్ల జాబితానుండి వాటిని తొలగించకుండా అలాగే కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు స్లిప్పులను కూడా సరిగ్గా పంపిణీ చేయలేకపోయారని లక్ష్మణ్ ఈసీని విమర్శించారు. 

ఇక కొత్తగా చేపట్టిన ఓటర్ల నమోదులో కూడా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందని... ఇందులో కూడా బోగస్ ఓట్ల నమోదు జరిగిందని అన్నారు. లోకసభ ఎన్నికల నాటికి ఓటర్ల జాబితా పారదర్శకంగా వుండేలా చూడాలని సీఈవో కు అందించిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. అలాగే లోక్ సభ ఎన్నికల పోలింగ్ సెలవు దినాల్లో కాకుండా వారం మధ్యలో పెట్టాలని...అప్పుడే ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశముంటుందని వివరించారు. ఇక వివిపాట్ లను వినియోగిస్తున్నారు కావున పోలింగ్ సమయాన్ని మరింత పెంచాల్సిన అవసరముందని బిజెపి నాయకులు ఈసీకి సూచించారు. 

వీడియో

"