Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ నాయ‌కులు బ‌ట్టేబాజ్ మాటలు చెప్తున్న‌రు- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

తెలంగాణ లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు. బీజేపీ నాయకులు బట్టేబాజ్ మాటలు చెప్తున్నరని విమర్శించారు. బాల్కొడ నియోజకర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంగళవారం ఆమె మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. 

BJP leaders are saying the words of Buttebaz- MLC Kalvakuntla kavitha
Author
Hyderabad, First Published Dec 7, 2021, 5:59 PM IST

బీజేపీ నాయ‌కులు బ‌ట్టేబాజ్ మాట‌లు చెప్తున్న‌ర‌ని, వారితో ఎలాంటి అభివృద్ధి జ‌ర‌గ‌ద‌ని ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. అభివృద్ధిలో తెలంగాణ‌ను దేశంలోనే అగ్ర‌గామిగా నిలిపిన ఘ‌న‌త సీఎం కేసీఆర్‌కే ద‌క్కుతుంద‌ని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం భీమ్ గల్ లో ఎమ్మెల్సీ క‌విత మంగ‌ళ‌వారం ప‌ర్య‌టించారు. మంత్రి ప్ర‌శాంత్ రెడ్డితో క‌లిసి ప‌లు అభివృద్ధి ప‌నుల ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌నలు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె బీజేపీపై ఘాటైన విమ‌ర్శ‌లు చేశారు. కొంత మంది నాయ‌కులు రాజ‌కీయం చేయ‌డానికి ఇష్టం వచ్చిన‌ట్టు మాట్లాడుతున్నార‌ని అన్నారు.  వారి మాట‌లు న‌మ్మ‌వ‌ద్ద‌ని అన్నారు. బీజేపీ నాయ‌కులు రాజ‌కీయాల కోసం బ‌ట్టేబాజ్ మాటాలు మాట్లాడుతున్నార‌ని తీవ్రంగా విమ‌ర్శించారు. సీఎం కేసీఆర్ ప‌ని చేసే నాయ‌కుడు కాబ‌ట్టే ప్ర‌జ‌లు రెండు సార్లు ఆయ‌న‌ను సీఎం చేశార‌ని చెప్పారు. ప‌ని చేసే నాయ‌కులను రాష్ట్ర ప్ర‌జ‌లు ఆశీర్వ‌దిస్తార‌ని అన్నారు. ఇప్పుడు తెలంగాణ ఇంత అభివృద్ధి ప‌థంలో న‌డుస్తుందంటే దానికి కార‌ణం కేసీఆరే అని తెలిపారు. ఆయ‌న రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో చిత్త‌శుద్ధిగా ప‌ని చేస్తున్నార‌ని చెప్పారు. అలాంటి వ్య‌క్తిపై బీజేపీ నాయ‌కులు ఇష్ట‌మొచ్చినట్టు మాట్లాడ‌టం స‌రైంది కాద‌ని  అన్నారు. ఆ పార్టీ నాయ‌కుల‌తో ఎలాంటి అభివృద్ధి ప‌నులు జ‌రగ‌వ‌ని చెప్పారు. 

https://telugu.asianetnews.com/telangana/telangana-an-mou-with-the-german-company-invest-rs-1500-cr-in-telangana-r3p3v9

బంగారు బాల్కొండ గా మారుస్తాం..
తెలంగాణ‌లోని బాల్కొండ నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి ప‌థంలో నిలిపేందుకు మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి చాలా కృషి చేస్తున్నార‌ని కొనియాడారు.  ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని బంగారు బాల్కొండగా మార్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని చెప్పారు. భీంగ‌ల్ ప‌ట్ట‌ణాన్ని అందంగా తీర్చిదిద్దుతామ‌ని అన్నారు. ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తున్నామ‌ని చెప్పారు. ప‌ని చేసే వారికే ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు ఇస్తార‌ని చెప్పారు. అందుకే సీఎం కేసీఆర్ ఆధ్వ‌ర్యంలో రెండు సార్లు టీఆర్ఎస్ అధికారం చేప‌ట్టింద‌ని అన్నారు. సీఎం కేసీఆర్ కు ప్ర‌జ‌ల ఆశీర్వాదం ఉంద‌ని అన్నారు. ఆయ‌న ప్ర‌జ‌ల నాయ‌కుడని క‌విత చెప్పారు. అనంత‌రం మంత్రి ప‌శ్రాంత్ రెడ్డి మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆధ్వ‌ర్యంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతోంద‌ని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అయిన బీజేపీ ప‌లు రాష్ట్రాల్లో అధికారంలో ఉంద‌ని, ఆ రాష్ట్రాల్లో తెలంగాణ‌లో జరుగుతున్న అభివృద్ధి ఎందుకు జ‌ర‌గడం లేద‌ని ప్ర‌శించారు. అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు జ‌ర‌గ‌డం లేద‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ క‌విత క‌లిసి ప్రారంభించారు. మ‌హిళా సంఘాల‌కు లోన్ల‌కు సంబంధించిన చెక్కుల‌ను అంద‌జేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios