Asianet News TeluguAsianet News Telugu

కవిత ఒక్క దాని మీదనే కాదు..టీఆర్ఎస్ నేతలందరి మీదా దాడులు జరగాలి.. విజయశాంతి

ఎనిమిదేళ్ల నుంచి చేస్తున్న పాపాలు పండుతున్నాయని ఎమ్మెల్సీ కవిత మీద బీజేపీ నేత విజయశాంతి షాకింగ్ కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ నేతలందరిమీదా దాడులు జరగాలని అన్నారు. 

BJP leader Vijayashanthi satires on CBI notices to MLC Kavitha
Author
First Published Dec 3, 2022, 12:57 PM IST

హైదరాబాద్ : ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసుల నేపథ్యంలో బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. ఎనిమిదేళ్లుగా చేసిన పాపాలు పండుతున్నాయని అన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ కానీ వాళ్ల డ్యూటీ వాళ్లు చేస్తారు. వాళ్లపని వాళ్లను చేయనివ్వాలి.. హంగామా చేయడం ఎందుకు అన్నారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే సరిపోతుంది. వాళ్లకు డౌట్ వస్తే వాళ్లు తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటారు. 

ఇక తెలంగాణకు వచ్చేసరికి.. ఇక్కడ అవినీతి భయంకరంగా జరుగుతున్నాయని మేము చాలా రోజులుగా చెబుతున్నాం. ఇప్పుడు దేవుడు కనికరించాడు. మా గోడు దేవుడు విన్నాడు. ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని తీసుకువచ్చాం. తెలంగాణ ప్రజలకు న్యాయం జరగడం లేదు. ఒక కుటుంబానికి మాత్రమే న్యాయం జరుగుతోంది. ఈడీ రైడ్స్ కు మీరు ఎక్కువ హంగామా చేస్తున్నారంటే మీదే ఏదో తప్పు ఉందన్నట్టు అన్నారు.

సీబీఐ విచారణలో కవిత వాస్తవాలు చెప్పాలి.. : తరుణ్ చుగ్

ఒకరిద్దరి మీదనే కాదు యావత్ తెలంగాణ టీఆర్ఎస్ నాయకులందరిమీద దాడులు జరగాలి. వాళ్లు ఎంత దోచుకున్నారో ప్రజలకు తెలియాలి. తెలంగాణ ముసుగుతో ఎలా దోచుకుంటున్నారో ప్రజలు తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి దగ్గరినుంచి అందరూ అదేపని.. దీనిమీద ప్రజలకు తెలియాలి. మోడీ రావడానికి ఆయనకేం వేరే పనిలేదా..అంటూ ప్రశ్నించారు. 

తెలంగాణలోని ఈ రాజకీయ పరిణామాల మీద.. కేసీఆర్ నెక్ట్స్ వ్యూహం ఏంటో, రాబోయే ఎన్నికల కోసం కేసీఆర్ ఇంకోసారి మోసం ఎలా చేయబోతున్నాడో ఓ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను అని చెప్పుకొచ్చారు. ఉద్యమనాయకురాలిగా మాట్లాడడం నా బాధ్యత అని అన్నారు. బీజేపీ చేయిస్తుందన్న దానిమీద స్పందిస్తూ.. బీజేపీకి ఏం పనీ పాటా లేదా అంటూ కేసీఆర్ వ్యాఖ్యలను విమర్శించారు. బుర్ర ఉండి మాట్లాడుతున్నారో, బుర్ర లేకుండా మాట్లాడుతున్నారో వారికే తెలియాలి అంటూ కేసీఆర్, కవిత.. టీఆర్ఎస్ నేతలకు చురకలు వేశారు. 

హైదరాబాద్ లోని నా ఇంట్లోనే సీబీఐని కలుస్తాను.. ఎమ్మెల్సీ కవిత...

ఇదిలా ఉండగా, ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ నేత కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో అరెస్టైన అమితక అరోరా రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించారు. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు శుక్రవారంనాడు సీఆర్పీసీ సెక్షన్ 160 కింద సీబీఐ నోటీసు జారీ చేయబడింది. ఈ నోటీసులో డిసెంబర్ 6వ తేదీన ఉదయం పదకొండు గంటలకు దీనిమీద వివరణ ఇచ్చేందుకు హాజరు కావాలని పేర్కొన్నారు. 

ఈ నోటీసు వచ్చిన నేపథ్యంలో కల్వకుంట్ల కవిత దీనిమీద స్పందించారు. ‘ఢిల్లీ లిక్కర్ స్కాంలో నా పేరు ఉండడం మీద వివరణ కోరుతూ సీఆర్ పీసీ సెక్షన్ 160 కింద నాకు సీబీఐ నోటీసు జారీ చేయబడింది. అందులో వారు పేర్కొన్న ప్రకారం... వారి అభ్యర్థన మేరకు డిసెంబర్ 6వ తేదీన హైదరాబాద్‌లోని నా నివాసంలో కలుసుకోవచ్చని అధికారులకు తెలియజేశాను’ అని తెలిపారు. ఈ క్రమంలో ఆమె ఈ రోజు ఉదయం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు.

Follow Us:
Download App:
  • android
  • ios