తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తుండగా మధ్యలోనే వచ్చేయడంపై స్పందించారు బీజేపీ నేత విజయశాంతి. తెలంగాణను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణవాదాన్ని అణచివేయాలని ప్రయత్నించిన వారు వేదికపై వున్నారంటూ ఆమె వ్యాఖ్యానించారు. 

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి కిషన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. అయితే సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి ఈ కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోవడం కలకలం రేపింది. దీనిపై మీడియాలో రకరకాలుగా కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాములమ్మ స్పందించారు.

Scroll to load tweet…

సమావేశం మధ్యలోనే వెళ్లిపోయాననడం సరికాదని.. కిషన్ రెడ్డిని కలిసి అభినందించానని తలిపారు. తెలంగాణను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణవాదాన్ని అణచివేయాలని ప్రయత్నించిన వారు వేదికపై వున్నారంటూ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని విజయశాంతి అన్నారు. తనకు అసౌకర్యంగా వున్నందునే అక్కడి నుంచి వెళ్లిపోయానని ఆమె ట్వీట్ చేశారు. చివరి వరకు ఉండలేకపోయానని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతున్న సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించారు. తెలంగాణ విడిపోతే కరెంట్ కష్టాలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇటీవల ఆయన బిజెపిలో చేరారు.