బండి సంజయ్‌ని తప్పిస్తే చేరికలుండవు: బీజేపీ నేత విజయరామారావు సంచలనం


బండి సంజయ్ ను  పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పిస్తే  పార్టీకి నష్టమేనని  మాజీ మంత్రి విజయరామారావు వ్యాఖ్యానించారు. 

BJP Leader  Vijayarama Rao  Sensational Comments  On Rumours of Change in Telangana BJP Leadership lns

హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  మారుస్తారనే  ప్రచారం సాగుతుంది.  అయితే  ఈ ప్రచారాన్ని  బీజేపీ జాతీయ నాయకత్వం  తోసిపుచ్చింది.  బండి సంజయ్ ను  తప్పిస్తే  పార్టీలో  చేరికల కంటే  పార్టీ నుండి వెళ్లిపోయేవారే  ఎక్కువగా  ఉంటారని  బీజేపీ  నేత విజయరామారావు  వ్యాఖ్యానించారు.  ట్విట్టర్ వేదికగా  విజయరామారావు  ఈ వ్యాఖ్యలు  చేశారు. 

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను  మార్చాలని  మాజీ మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అమిత్ షా,  జేపీ నడ్డాలను  కలిసి  కోరినట్టుగా  ప్రచారం సాగింది.  బండి సంజయ్ ను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తప్పించబోమని  పార్టీ జాతీయ  నాయకత్వం  తేల్చి చెప్పిందని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.  

also read:జాగ్రత్తగా మాట్లాడాలి: జితేందర్ రెడ్డికి ఈటల కౌంటర్

రెండు  రోజుల క్రితం  మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి ట్విట్టర్ వేదికగా  చేసిన  పోస్టు  బీజేపీలో  కలకలం రేపింది.  ఓ జంతువును  తన్నుతూ  ఆటో ట్రాలీలో  ఎక్కించే  వీడియోను పోస్టు చేస్తూ  బీజేపీ నేతలకు  ఈ రకమైన ట్రీట్ మెంట్ కావాలని  వ్యాఖ్యానించారు. ఈ పోస్టును  బీజేపీ అగ్రనేతలకు ట్యాగ్  చేశారు . అయితే బండి సంజయ్ ను తప్పించాలనే  నేతలనుద్దేశించే తాను  ఈ పోస్టు పెట్టినట్టుగా  జితేందర్ ఈ పోస్టు పెట్టినట్టుగా  జితేందర్ రెడ్డి ట్విట్టర్ లో  వివరణ ఇచ్చారు. 

 

ఇదిలా ఉంటే  జితేందర్ రెడ్డి వ్యాఖ్యలపై  మాజీ మంత్రి ఈటల రాజేందర్  నిన్న  స్పందించారు. వయస్సు, అనుభవం ఉన్న నేతలు  జాగ్రత్తగా మాట్లాడాలని  సూచించారు.ఈ సమయంలో  ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి విజయరామారావు  వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ ను  అధ్యక్ష బాధ్యతల నుండి తప్పిస్తే  పార్టీకి నష్టమని ఆయన  అభిప్రాయపడ్డారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios