మొయినాబాద్ ఫాంహౌస్ వీడియోలపై ప్రమాణం చేయాలి:కేసీఆర్ కు తరుణ్ చుగ్ సవాల్

మొయినాబాద్  ఫాంహౌస్ వీడియోలపై ఆలయంలో ప్రమాణం చేయాలని బీజేపీ తెలంగాణ ఇంచార్జీ తరుణ్ చుగ్ కేసీఆర్ కు సవాల్ విసిరారు.

BJP Leader Tarun Chugh challenges To KCR  oath in Temple Over Moinabad Farm house incident

న్యూఢిల్లీ: మొయినాబాద్ ఫాంహౌస్ లో ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టినట్టుగా  కేసీఆర్ చేసిన ఆరోపణలతో తమకు సంబంధం లేదని బీజేపీ  తెలంగాణ  రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ  తరుణ్  చుగ్  చెప్పారు. కేసీఆర్ నిన్న విడుదల చేసిl వీడియోలతో  తమకు సంబంధం లేదని  ఆయన స్పష్టం చేశారు.బీజేపీ  తెలంగాణ రాష్ర వ్యవహరాల ఇంచార్జీ తరుణ్ చుగ్  శుక్రవారంనాడు న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. 

మొయినాబాద్  పాంహౌస్ లో ఎమ్మెల్యేల ప్రలోభాల  అంశానికి  సంబంధించి తెలంగాణ  సీఎం కేసీఆర్  గురువారంనాడు రాత్రిమీడియా  సమావేశంలో కొన్ని వీడియోలను విడుదల చేశారు.  ఎమ్మెల్యేల కొనుగోలులో బీజేపీ  ప్రమేయం  ఉందని ఆయన ఆరోపించారు. ఈ విషయమై  తరుణ్  చుగ్  స్పందించారు.

alsoread:
ఈ వీడియోలపై  దమ్ముంటే  కేసీఆర్ ఆలయంలో ప్రమాణం చేయాలని ఆయన సవాల్  చేశారు.  ఈ ముగ్గురు వ్యక్తులతో తమకు  సంబంధం లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదాద్రి ఆలయంలో ప్రమాణం  చేసిన విషయాన్నిఆయన గుర్తు చేశారు.

 ఎమ్మెల్యేల ప్రలోభాలతో తమకు సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు. నిజనిజాలేమిటో  ఎన్నికల్లో ప్రజలే  తేలుస్తారని తరుణ్  చుగ్  చెప్పారు.మునుగోడులో  టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి  పాల్పడిందని ఆయన ఆరోపించారు. పోలింగ్ కు కొన్ని గంటలముందు వరకు మంత్రులు మునుగోడులోనే ఉన్నారన్నారు. ప్రధానమంత్రి  కావాలని కేసీఆర్ కలలు కంటున్నారని తరుణ్  చుగ్  చెప్పారు.ఈ  కారణంతోనే ప్రధాని మోడీపై కేసీఆర్ విమర్శలు చేస్తున్నారని ఆయన చెప్పారు.

also read:ఫాంహౌజ్ కుట్ర నిన్న మొన్నటి కాదు.. కేంద్రం హిట్ లిస్ట్‌లో 4 రాష్ట్ర ప్రభుత్వాలు : కేసీఆర్

మునుగోడులో  కేసీఆర్ అహంకారం ఓడిపోతుందన్నారు. మునుగోడులో తమ  పార్టీ  విజయం సాధిస్తుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.ప్రధాని  చేస్తున్నఅభివృద్దిపై ఎక్కడైనా చర్చకు తాము  సిద్దంగా  ఉన్నామని  తరుణ్  చుగ్ చెప్పారు.ప్రజలకు  ఏం చేశారో చెప్పడానికి టీఆర్ఎస్ సిద్దంగా ఉందా  అని ఆయన  ప్రశ్నించారు. తెలంగాణప్రజలకుఇచ్చిన హామీలను  కేసీఆర్ నెరవేర్చలేదని  ఆయన చెప్పారు. ప్రజలకు ఇచ్చిన  హామీలను నెరవేర్చనందుకు గాను కేసీఆర్ కు  ప్రజలు బైబై  చెప్పేందుకు  సిద్దంగా  ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios