తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంఐఎం పార్టీలపై బీజేపీ సీనియర్ నేత మురళీధర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ నుంచి ఆదిలాబాద్ వరకు ఎంఐఎం పార్టీ టెర్రర్‌ కారిడార్‌ ఏర్పాటు చేస్తోందని విమర్శించారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంఐఎం పార్టీలపై బీజేపీ సీనియర్ నేత మురళీధర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ నుంచి ఆదిలాబాద్ వరకు ఎంఐఎం పార్టీ టెర్రర్‌ కారిడార్‌ ఏర్పాటు చేస్తోందని విమర్శించారు. నిజామాబాద్, బైంసా, నిర్మల్, బోధన్ ప్రాంతాలను ఉగ్రవాదానికి అడ్డాగా మార్చారని ఆరోపించారు. ఇందుకు టీఆర్‌ఎస్‌, పోలీసులు సహకరిస్తున్నారన్నారని మండిపడ్డారు. నిజామాబాద్, ఆదిలాబాద్‌లో లవ్ జిహాద్ కేసులలో పురోగతి లేదన్నారు. తెలంగాణ భారతదేశంలో ఉందా..? లేక పాకిస్తాన్‌లో ఉందా..? అని ప్రశ్నించారు. 

కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన సమయంలో ఛత్రపతి శివాజీని పొగిడారని మురళీధర్ రావు అన్నారు. కానీ నిన్న బోధన్‌లో శివాజీ విగ్రహం అంశంలో టీఆర్ఎస్‌, ఎంఐఎం కలిసి హిందువులపై దాడి చేశాయని ఆరోపించారు. దాడులకు గురైనవారిపైనే కేసులు పెట్టారని మండిపడ్డారు. ఛత్రపతి శివాజీకి జై అంటే నేరమా? అని ప్రశ్నించారు. 

కేసీఆర్ అసెంబ్లీలో అబద్దాలు మాట్లాడారని మురళీధర్‌రావు విమర్శించారు. ముస్లిం మతోన్మాదానికి, ఉగ్రవాద కార్యకలాపాలకు కేసీఆర్ కారణమని.. వాటికి ఆయనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బెంగళూరుకి వచ్చినన్ని పెట్టుబడులు హైదరాబాద్‌కి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ నుండి హిందులు వలసలు ఎందుకు జరిగాయని నిలదీశారు. పాతబస్తీలో హిందువుల సంఖ్య ఎందుకు తగ్గిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. 

హిందుల ప్రాణాల, ఆస్తుల నష్టానికి కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి మహమూద్ ఆలీ రోహింగ్యాలకు సహకరిస్తున్నారని ఆరోపించారు. త్వరలో కశ్మీర్ ఫైల్స్‌లాగా హైదరాబాద్ ఫైల్స్ కూడా వస్తోందని అన్నారు. కాశ్మీర్ ఫైల్స్ ని ప్రశ్నిస్తే మాడి మసై పోతారని వ్యాఖ్యానించారు. ఉందన్నారు. కశ్మీర్‌కి రక్షణ లేక పోతే తెలంగాణకు కూడా లేనట్లేనని పేర్కొన్నారు. 

ఇక, ఇక, నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బోధన్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో శనివారం రాత్రికి రాత్రే ఓ వర్గం శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే చోటుచేసుకున్న పరిణామాలు అక్కడ ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో నేడు బోధన్‌లో హిందూ సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. అయితే ఇవాళ బంద్‌కు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. బలవంతంగా బంద్ చేయిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ క్రమంలోనే బోధన్‌లో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పికెటింగ్ ఏర్పాటు చేసి.. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు బోధన్‌లో ఆర్టీసీ బస్సుల యథాతథంగా తిరుగుతున్నాయి. 

బోధన్‌లో పరిస్థితి అదుపులో ఉందని నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌ నాగరాజు తెలిపారు. నిన్నటి ఘటనలో 10 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్టుగా చెప్పారు. విగ్రహం ఏర్పాటుకు కలెక్టర్ అనుమతి పొందలేదని తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా ఆందోళనకారులను గుర్తించామని వెల్లడించారు. 170 మందిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఇతర ప్రాంతాల నాయకులు బోధన్‌కు రావొద్దని సూచించారు.