Asianet News TeluguAsianet News Telugu

క్యాబ్ లో వెళ్లి పోలీసులకు లక్ష్మణ్ టోకరా

ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ.. విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ సోమరవారం నిరాహార దీక్ష చేపట్టారు. 
 

BJP leader lakshman started hunger strike in hyderabad
Author
Hyderabad, First Published Apr 29, 2019, 12:49 PM IST

ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ.. విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ సోమరవారం నిరాహార దీక్ష చేపట్టారు. 

ఇంటర్ ఫలితాల్లో గందరగోళం కారణంగా.. ఇప్పటికే 20మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లక్ష్మణ్ ఆందోళన చేపట్టారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని,  ఇంటర్ బోర్డు కార్యదరర్శిని తొలగించాలని.. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై న్యాయ విచారణ జరపాలంటూ ఆయన డిమాండ్ చేశారు. 

తన డిమాండ్ లను నెరవేర్చాలంటూ.. ఆయన సోమవారం నుంచి నిరవధిక నిరాహాక దీక్ష చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్దసంఖ్యలో పోలీసులు  ముషీరాబాద్‌లోని లక్ష్మణ్‌  క్యాంపు కార్యాలయం ముందు మోహరించారు. ఆయన బయటకు రాగానే అదుపులోకి తీసుకోవాలని పోలీసులు భావించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసుల కళ్లుగప్పి ట్యాక్సీ కారులో చాకచక్యంగా ఆయన బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు ఏర్పాటుచేసిన వేదిక వద్ద ఆయన నిరాహార దీక్షకు దిగారు.

Follow Us:
Download App:
  • android
  • ios