బీజేపీ నేత కిషన్ రెడ్డికి మాతృవియోగం

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 25, Apr 2019, 8:10 AM IST
bjp leader kishan reddy mother passed away
Highlights

బీజేపీ నేత కిషన్‌రెడ్డి కి మాతృవియోగం కలిగింది. కిషన్ రెడ్డి  తల్లి గంగాపురం అండాలమ్మ(80) కన్నుమూశారు. 


బీజేపీ నేత కిషన్‌రెడ్డి కి మాతృవియోగం కలిగింది. కిషన్ రెడ్డి  తల్లి గంగాపురం అండాలమ్మ(80) కన్నుమూశారు. అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అండాలమ్మ తుదిశ్వాస విడిచారు. 

ఈ రోజు  మధ్యాహ్నం ఆమె స్వస్థలం కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అండాలమ్మ మృతిపట్ల పలువురు బీజేపీ నేతలు సంతాపం తెలిపారు.

బిజెపి నాయకుడు కిషన్ రెడ్డి తల్లి మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

loader