అంబర్ పేట తాజా మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మరోసారి భారతీయ జనతా పార్టీ తరపున ఎన్నికల బరిలో దిగుతున్న విషయం తెలిసిందే. అయితే  ఇవాళ జరుగుతున్న ఎన్నికల్లో కులుంబంతో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.   కాచిగూడలోని దీక్ష మోడల్ స్కూల్ పోలింగ్ బూత్ లో కిషన్ రెడ్డి దంపతులు, వారి కూతురు ఓటేశారు. 

పోలింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే కిషన్ రెడ్డి కుటుంబంతో కలిసి ఓటేయడానికి పోలింగ్ బూత్ వద్దకు వెళ్లారు. అయితే అదే సమయంలో ఈవీఎంలు మొరాయించాయి. దాదాపు గంట సేపటి తర్వాత ఈవీఎంల సాంకేతిక సమస్య పరిష్కారమవడంతో ఓటింగ్ ప్రారంభమైంది. దీంతో కిషన్ రెడ్డి కుటుంబం ఎట్టకేలకు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా అన్నిచోట్ల పోలింగ్‌ ప్రారంభమైంది. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే చాలాచోట్ల ఈవీఎంలు మొరాయిస్తుండటంతో పోలింగ్ ప్రక్రియకు అంతరాయం కలుగుతోంది.