Asianet News TeluguAsianet News Telugu

దళితులు సీఎం పదవికి అర్హులు కాదా? కేసీఆర్ తేల్చాలి : కిషన్ రెడ్డి.. ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎంపీ అర్వింద్...

దళితులు ముఖ్యమంత్రి పదవికి అర్హులు కాదా? సీఎం స్పష్టం చేయాలన్నారు. రాజకీయ లబ్ది కోసం లేని సమస్యను సృష్టించి సీఎం రైతులను ఆగం చేస్తున్నారని విమర్శించారు. ఏడేళ్లుగా తెలంగాణతో ఒప్పందం మేరకు ప్రతి ధాన్యం గింజను కేంద్రమే కొంటోందన్నారు. 

bjp leader kishan reddy, arvind fires on telangana cm KCR
Author
Hyderabad, First Published Nov 22, 2021, 4:58 PM IST

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేంద్రమంత్రి kishan reddy మండిపడ్డారు. తెలంగాణలో suicideలు చేసుకున్న రైతులకు ఆర్థిక సాయం చేస్తారా? చేయరా? సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సమస్య రైతులది కాదని, కదులుతున్న TRS పార్టీ పునాదులదే అసలు సమస్య అన్నారు. 

దళితులు ముఖ్యమంత్రి పదవికి అర్హులు కాదా? సీఎం స్పష్టం చేయాలన్నారు. రాజకీయ లబ్ది కోసం లేని సమస్యను సృష్టించి సీఎం రైతులను ఆగం చేస్తున్నారని విమర్శించారు. ఏడేళ్లుగా తెలంగాణతో ఒప్పందం మేరకు ప్రతి ధాన్యం గింజను కేంద్రమే కొంటోందన్నారు. 

హుజురాబాద్ ఓటమిని డైవర్ట్ చేయటానికే కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అబద్దాల పునాదుల మీదనే కేసీఆర్ కుటుంబం రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. పార్టీని బతికించుకోవటానికి Chief Minister ధర్నాలు చేయటం మొదటసారి చూస్తున్నానని కిషన్ రెడ్డి అన్నారు. 

Job notifications ఇవ్వకుండా కేంద్రంపై నిందలు వేయడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవటంతో ఎంఎంటీఎస్ పనులు నిలిచిపోయాయన్నారు. 
Dalit ముఖ్యమంత్రి అయితే తెలంగాణ అభివృద్ధి జరగదనే విధంగా సీఎం మాట్లాడడాన్ని ఖండిస్తున్నానన్నారు. కేసీఆర్ కుటుంబం శక్తినంతా ధారపోసినా హుజురాబాద్ లో ఓటమి తప్పలేదన్నారు.  బెస్టు టూరిస్ట్ విజిటింగ్ విలేజ్ గా పోచంపల్లి గ్రామాన్ని కేంద్రం ఎంపిక చేసిందన్నారు. 

అంబేద్కర్ వర్ధంతి డిసెంబర్ 6న విద్యార్థుల స్కాలర్ షిప్స్ ను జమ చేస్తామన్నారు. సుభాష్ చందరబోస్ జ్ఞాపకాలు నవ తరానికి తెలిసేలా చర్యలు తీసుకుంటాన్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 

ఇక మరో బీజేపీ నేత MP Arvind కూడా సీఎం కేసీఆర్ మీద ఘాటు విమర్శలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 19వ రోజు వడ్లపై క్లారిటీ ఇస్తాననన్న కేసీఆర్ కు తాగిన మత్తు దిగలేనట్లు ఉందన్నారు. కేసీఆర్ దేశాలు తిరగడానికి ప్రైవేట్ హెలికాప్టర్ కావాలా? అని ప్రశ్నించారు. Farmhouse లో తాగి, తినుడు తప్ప.. వ్యవసాయం ఎన్నడు చేశారని నిలదీశారు. పనికిమాలిన సీఎం ఎవరన్నా ఉన్నారా అంటే అది కేసీఆరేనని దుయ్యబట్టారు. ఏ పంట వేయాలో చెప్పానన్న KCR ఎక్కడున్నారు? అని అర్వింద్ ప్రశ్నించారు. 

ఉత్తరాదొళ్లేనా.. తెలంగాణ రైతన్నల కష్టాలు కానొస్తలేవా: కేసీఆర్‌పై షర్మిల వ్యాఖ్యలు

ఇదిలా ఉండగా, కేసీఆర్ ఢిల్లీ టూర్ లో ఉన్నారు..దీనిమీద మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోడీ  దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు... కాబట్టి వీటిని సమర్థించిన రాష్ట్ర బిజెపి నేతలు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేసారు. కేంద్ర ప్రభుత్వం ఏడాది కింద తెచ్చిన వ్యవసాయ చట్టాలు అనాలోచితంగా తీసుకొచ్చినవని వాటివల్ల రైతులకు అన్యాయం జరిగిందని దేశప్రజలముందు ప్రధాని ఒప్పుకున్నారని అన్నారు. 

ఇకపై అయినా కేంద్రంలోని BJP Government కండ్లు తెరిచి రైతు సమస్యలు తెలిసిన, రైతు ప్రయోజనాలు కాపాడే నేతలను పిలిపించుకుని మాట్లాడి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. రైతుమేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలని minister satyavathi rathode హితవు పలికారు. 

mahabubabad district మరిపెడ మండలం తాళ్ల ఊకళ్లు గ్రామంలో ఇవాళ(సోమవారం) ఉమామహేశ్వర దేవస్థానంలో లింగ పున:ప్రతిష్ట, ధ్వజస్థంభం ప్రతిష్ట కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని... పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. 

Follow Us:
Download App:
  • android
  • ios