టీ బీజేపీలో జితేందర్ రెడ్డి ట్వీట్ కలకలం.. ఆ ట్రీట్‌మెంట్ కావాలంటూ వీడియో పోస్టు.. కాసేపటికే..

తెలంగాణ బీజేపీలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ట్వీట్ కలకలం రేపుతోంది. తెలంగాణలో బీజేపీ పరిస్థితి‌ని విమర్శించేలా ట్వీట్ చేసిన జితేందర్ రెడ్డి.. కొద్దిసేపటికే దానిని డిలీట్ చేశారు.

bjp leader Jithender Reddy deleted controversial tweet some time after posting ksm

తెలంగాణ బీజేపీలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ట్వీట్ కలకలం రేపుతోంది. తెలంగాణలో బీజేపీ పరిస్థితి‌పై ట్వీట్ చేసిన జితేందర్ రెడ్డి.. కొద్దిసేపటికే దానిని డిలీట్ చేశారు. ఆ ట్వీట్‌లో జంతువును వెనకాల నుంచి కాలుతో తన్నుతూ ట్రాలీ ఎక్కిస్తున్న వీడియోను షేర్ చేసిన జితేందర్ రెడ్డి.. తెలంగాణ బీజేపీ నాయకత్వానికి ఇలాంటి ట్రీట్‌మెంట్ అవసరమని పేర్కొన్నారు. ఆ ట్వీట్‌లో బీఎల్ సంతోష్, బీజేపీ పార్టీ, అమిత్ షా, సునీల్ బన్సల్, తెలంగాణ బీజేపీ ట్విట్టర్ ఖాతాలను ట్యాగ్‌ చేశారు. అయితే కొద్దిసేపటికే జితేందర్ రెడ్డి ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. 

తెలంగాణ బీజేపీలో నేతల మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. కేసీఆర్ ఫ్యామిలీ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి, రాష్ట్ర నాయకత్వ పనితీరుపై కొందరు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు నేతలు పార్టీ మారుతారనే ప్రచారం కూడా తెరమీదకు వచ్చింది. దీంతో బీజేపీ అధిష్టానం నష్ణనివారణ చర్యలకు దిగింది. రాష్ట్రానికి చెందిన పలువురు నేతలతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో  జితేందర్ రెడ్డి.. ఈ విధమైన ట్వీట్ చేయడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన ఏ ఉద్దేశంతో ఈ ట్వీట్ చేశారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది. 

 

అయితే జితేందర్ రెడ్డి ట్వీట్‌కు సంబంధించిన స్క్రీన్ రికార్డింగ్‌ను పలువురు బీఆర్ఎస్ మద్దతుదారులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios