నల్గొండ: తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ మాత్రమేనని చెప్పుకొచ్చారు మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు. 

ప్రజల విశ్వాసం కోల్పోయిన పార్టీ కాంగ్రెస్ అంటూ విరుచుకుపడ్డారు. నల్గొండ జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆమె తెలంగాణ సీఎం కేసీఆర్ పైనా సెటైర్లు వేశారు. రాష్ట్రంలో అవినీతికి పాల్పడేది రెవెన్యూ అధికారులా లేక టీఆర్ఎస్ నాయకులా అని ప్రశ్నించారు. 

చట్టాల్లో మార్పు కోసం సీఎం కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదని హితవుపలికారు. ఓటమి భయంతోనే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రాక ముందే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నారని ఆమె ఆరోపించారు. తెలంగాణలో టీఆర్ఎస్‌ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీయేనని డీకే అరుణ చెప్పుకొచ్చారు.