Asianet News TeluguAsianet News Telugu

సెల్ఫీ వీడియో తీసుకుని బీజేపీ నేత ఆత్మహత్య... అప్పులవాళ్ల వేధింపులు తట్టుకోలేకే అంటూ లేఖ..

అప్పు ఇచ్చిన వ్యక్తి నుంచి తీవ్ర వేధింపులు ఎదురవుతుండడంతో ఓ బీజేపీ నేత ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ లో కలకలం రేపింది. 

BJP leader commits suicide due to harassment by lender in  Warangal - bsb
Author
First Published Feb 6, 2023, 6:49 AM IST

వరంగల్ : ఆదివారం వరంగల్ లో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. అప్పు ఇచ్చిన వ్యక్తి వేధింపులు తట్టుకోలేక ఓ బీజేపీ నేత ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. తన ఆవేదనను సెల్ఫీ వీడియో తీసుకుని మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం వరంగల్ ఎనుమాముల బాలాజీ నగర్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.  ఈ ఘటనకు సంబంధించి స్థానికులు పోలీసులు తెలిపిన వివరాలు ఈ మేరకు ఉన్నాయి. 
బిజెపి నేత గంధం కుమారస్వామి(45) బాలాజీ నగర్ నివాసి.  

రాజకీయాల్లో కొనసాగుతూనే ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో  వ్యాపారం చేస్తున్నాడు. వరంగల్ నగరపాలక సంస్థకు జరిగిన గత ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ నుండి కార్పోరేటర్ టికెట్ ఆశించాడు. అయితే, అది ఆయనకు రాలేదు. దీంతో  కుమారస్వామి టీఆర్ఎస్ లోనుంచి బీజేపీలోకి చేరారు. బిజెపి పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎనుమాముల మాజీ సర్పంచ్ సాంబేశ్వర్ నుంచి ఎన్నికల ఖర్చుల నిమిత్తం ఎన్నికల సమయంలో రూ. 25 లక్షలు తీసుకున్నాడు. 

కేసీఆర్‌పై తిరుగుబాటు బావుటా.. బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గంపై వేటు

అయితే ఎన్నికల్లో ఓడిపోవడంతో ఓవైపు ఓటమి బాధ కృంగదీస్తోంది.  మరోవైపు ఇచ్చిన 25 లక్షలు తిరిగి ఇవ్వమంటూ మాజీ సర్పంచ్ వేధింపులు ఎక్కువయ్యాయి. ఆ ఒత్తిడి తట్టుకోలేక తాను చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఆయన సెల్ఫీ వీడియోలో తెలిపారు. నమ్మినవారు తనను మోసం చేశారని, నేను చనిపోయిన తర్వాత ని భార్యా పిల్లలను వేధించొద్దంటూ లేఖ కూడా రాశారు. ఆ తర్వాత ఆ సెల్ఫీ వీడియోను స్నేహితులకు పంపించాడు.  ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయాడు. ఆ సమయంలో ఆయన భార్య మరో గదిలో ఉంది. 

అతను ఆత్మహత్యాప్రయత్నం చేయడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికి అతను మరణించాడు. కుమార స్వామికి భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉంది. ఈ మృతి పట్ల కుటుంబ సభ్యులు  తేరుకోలేకపోతున్నారు. గంధం కుమారస్వామి భార్య లక్ష్మి భర్త మరణానికి కారణం సాంబేశ్వర్, ఆయన భార్య ప్రమీల, మరో వ్యక్తి కోట విజయకుమార్ లపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరిపై చర్యలు తీసుకోవాలని కోరింది. కాగా, చిన్న పరిశ్రమల విభాగంలో కుమారస్వామి  ఉత్తమ పారిశ్రామికవేత్తగా అవార్డు కూడా అందుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios