Asianet News TeluguAsianet News Telugu

ఉస్మానియా అంటే కేసిఆర్ కు అస్సలు పడదు

  • ఉస్మానియా ప్రతిష్ట దెబ్బ తీశారు
  • ఓయు కు చెడ్డపేరు తెచ్చేందుకు చూస్తున్నారు
  • సైన్స్ కాంగ్రెస్ వాయిదా బాధ్యత  కేసిఆర్ దే
BJP kishan Reddy alleges KCR trying to tarnish OU image

ఉస్మానియా యూనివర్శిటీ అంటే సిఎం కేసిఆర్ కు పడదని బిజెపి శాసనసభాపక్ష నేత జి.కిషన్ రెడ్డి విమర్శించారు. అందుకే ఉస్మానియా యూనివర్శిటీకి చెడ్డపేరు వచ్చేలా సైన్స్ కాంగ్రెస్ సదస్సును వాయిదా వేశారని మండిపడ్డారు. జనవరి 3 నుండి 7 వరకు జరగవలసిన సైన్స్ కాంగ్రెస్ వాయిదా వేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. గత సంవత్సరం తిరుపతి లో అక్కడి ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తే తెలంగాణ సర్కారుకు ఎం కష్టమొచ్చిందో చెప్పాలన్నారు.

టి ఆర్ ఎస్ ప్రభుత్వం ఒత్తిడి వల్లే ఈ సమావేశాలను వాయిదా వేశారని విమర్శించారు. 62 దేశాలకు సంబందించిన వారు పేర్లను నమోదు చేసుకున్నారని, ఏడుగురు నోబెల్ బహుమతులు పొందిన వారు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. ఈ మీటింగ్ కోసం వచ్చే వారికి హోటల్స్,కార్స్ బుక్ కూడా చేసిన వషయాన్ని చెప్పారు. విమాన టికెట్స్ కూడా బుక్ చేశారన్నారు. సైన్స్ కాంగ్రెస్ మీటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేసి ఇలా చేయడమేంటని ప్రశ్నించారు. ప్రతినిధుల నుండి రిజిస్ట్రేషన్ ఫీ కూడా తీసుకున్నారు కదా అని నిలదీశారు.

కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టారంటే కేవలం ఓయూ ప్రతిష్టను దెబ్బతీసేలా ఈ ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు. ప్రభుత్వం ఏకపక్ష వైఖరిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. దేశ,రాష్ర్ట ప్రతిష్టను కూడా ప్రభుత్వం దెబ్బతీసేవిధంగా నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ కు ఇష్టం లేదు కాబట్టే సభలను వాయిదా వేశారన్నారు. ఇలాంటి సభలు నిర్వహించక పోవడం తెలంగాణ కు అవమానమే అన్నారు.

ఓయూ కు చెడ్డ పేరు వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం  వ్యవహరిస్తోందన్నారు. దీనికి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. ఓయూ అంటే కేసీఆర్ కు ఇష్టం లేదు కాబట్టే ఇలా చేశారని చురకలు అంటించారు. ద్వేషాపురితంగానే ఓయూ లో జరిగే సైన్స్ కాంగ్రెస్ ను సీఎం కేసీఆర్ వాయిదా వేశారని ఆరోపించారు. సైన్స్ కాంగ్రెస్ సభల వాయిదా నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. ఎలాంటి ఆటంకాలు కలగకుండా బీజేపీ విద్యార్థులతో మాట్లాడుతుందని చెప్పారు.

 

అవి టిఆర్ఎస్ సభలే తప్ప తెలుగు సభలు కాదు

తెలుగు మహా సభలు లక్ష్యం లేకుండా నిర్వహించారని కిషన్ రెడ్డి విమర్శించారు. తెలుగు భాషా అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలన్నారు. ఏమయినా నిర్ణయాలు తీసుకుందా? కేవలం కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు మీటింగ్ ను నిర్వహించారని ఎద్దేవా చేశారు. తెలుగు మహాసభ పేరుతో సీఎం స్వంత భజన చేసుకున్నారు తప్ప ఇంకోటి కాదన్నారు. రాచరిక పాలనకు తెలుగు మహాసభ వేదిక అయిందని ఎద్దేవా చేశారు. తెలుగు విశ్వవిద్యాలయంకు ఏమయినా ప్రోత్సాహకాలు ప్రకటించారా అని ప్రశ్నించారు. తెలుగు కళాశాలకు ఏ ఒక్క రూపాయి అయినా కేటాయించారా చెప్పాలన్నారు. అవి తెలుగు మహా సభలా లేక టి ఆర్ ఎస్ మహా సభలా అన్న అనుమానాలు వచ్చాయన్నారు. టి ఆర్ ఎస్ నాయకులను ఏ అర్హత తో ముఖ్యఅతిధులుగా ఆహ్వానించారో చెప్పాలన్నారు. మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ వేదిక క్రింద ఉంటారు అసదుద్దీన్ ఒవైసీ వేదిక పైన ఉంటారు ఇదేం పద్ధతి అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన కవులు,కళాకారులకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి పొగడ్త కేసీఆర్ కి వస్తే రెండో పొగడ్త నిజాం కు వచ్చాయని చురకలేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios