హైదరాబాద్: సిద్దిపేట సీపీని సస్పెండ్ చేయాలని బీజేపీ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ ను కోరారు. సిద్దిపేటలో సోదాలపై సీబీఐ విచారణ జరిపించాలని కూడ వారు కోరారు.

మంగళవారం నాడు బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే నల్లు ఇంద్రసేనారెడ్డిలు  రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి వినతి పత్రం సమర్పించారు. సిద్దిపేటలో సోదాల ఘటనలో పోలీసుల తీరును బీజేపీ నేతలు తప్పుబట్టారు. సిద్దిపేట సీపీని సస్పెండ్ చేయాలని కోరారు.

also read:ఆ డబ్బులతో నాకేం సంబంధం: రఘునందన్ రావు

సిద్దిపేట ఘటనపై సీబీఐతో విచారణ చేయించాలని కోరారు. సిద్దిపేటలో అంజన్ రావు ఇంట్లో పోలీసుల సోదాల్లో రూ. 18 లక్షలను సీజ్ చేశారు. ఇందులో రూ. 5 లక్షలను బీజేపీ కార్యకర్తలు తీసుకెళ్లారని సీపీ చెప్పారు.

ఈ విషయమై రెండు వేర్వేరు కేసులు  నమోదు చేశారు. మరో వైపు సీపీ తనపై దాడి చేశారని కరీంనగర్ ఎంపీ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండు రోజులుగా దీక్షకు దిగాడు.