Asianet News TeluguAsianet News Telugu

ఆగష్టు 24 నుండి ప్రజా సంగ్రామ యాత్ర: బండి సంజయ్ పాదయాత్ర పేరు ఖరారు


బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర పేరును ఖరారు చేశారు. ఈ నెల 24వ తేదీ నుండి పాదయాత్ర కొనసాగనుంది. శుక్రవారం నాడు పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేసిన తర్వాత బీజేపీ నేతలు ఈ యాత్ర పేరును ప్రకటించారు.  పాతబస్తీ నుండి హుజూరాబాద్ వరకు బండి సంజయ్ యాత్ర కొనసాగుతోంది.

Bjp confirmes Bandi Sanjay's padayatra name  as praja sanjgrama yatra
Author
Hyderabad, First Published Aug 13, 2021, 11:11 AM IST

హైదరాబాద్: ఈ నెల 24వ తేదీ నుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్ రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ పాదయాత్రకు ప్రజా సంగ్రామ యాత్రగా పేరు పెట్టారు.

ఈ నెల 24వ తేదీన ఉదయం హైద్రాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయం నుండి బండి సంజయ్ పాదయాత్రను ప్రారంభిస్తారు. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం వరకు యాత్రను కొనసాగిస్తారు.

శుక్రవారం నాడు భాగ్యలక్ష్మి ఆలయంలో బీజేపీ నేతలు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.ఈ పూజల తర్వాత ప్రజాసంగ్రామ యాత్ర పేరును  ప్రకటించారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ పేరును మీడియాకు తెలిపారు. 

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ  పాదయాత్ర చేయాలని  బీజేపీ చీఫ్ నిర్ణయం తీసుకొన్నాడు.ఈ నెల మొదటి వారంలోనే  పాదయాత్ర చేయాలని తొలుత షెడ్యూల్ ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో  పాదయాత్రను  ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు.

విడతల వారీగా ఈ పాదయాత్ర నిర్వహించనున్నారు బండి సంజయ్. మొదటి విడతగా ఈ నెల 24వ తేదీ నుండి యాత్ర ప్రారంభం కానుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలను పురస్కరించుకొని తొలివిడత పాదయాత్ర ఈ రూట్‌ గుండా సాగనుంది. మొదటి విడత యాత్ర తర్వాత  రాష్ట్ర వ్యాప్తంగా మరో విడత యాత్రను బండి సంజయ్ నిర్వహించనున్నారు.

ఈ యాత్రను విజయవంతం చేసేందుకు గాను బీజేపీ ఆధ్వర్యంలో పలు కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు పాదయాత్రను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి.


 

 


 

Follow Us:
Download App:
  • android
  • ios