సిద్దిపేట: దుబ్బాక ప్రజలు చైతన్యవంతులు కాబట్టే బీజేపీని గెలిపించారని  ఈ ఎన్నికల్లో విజయం సాధించిన రఘునందన్ రావు చెప్పారు.

ఈ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత బీజేపీ నేత రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. తనకు ఓటేసిన గెలిపించిన  నియోజకవర్గ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

also read:దుబ్బాక బైపోల్, ట్విస్టిచ్చిన సీఈఓ శశాంక్ గోయల్: ఆ నాలుగు ఈవీఎంలు లెక్కించలేదు

దుబ్బాక ఉప ఎన్నికల్లో ఫలితం చివరకు నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది.దుబ్బాక  స్థానం నుండి గతంలో రెండు దఫాలు రఘునందన్ రావు పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. సోలిపేట రామలింగారెడ్డి  మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందని భావించిన బీజేపీ నాయకత్వం ఈ స్థానంపై కేంద్రీకరించింది.

దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఈ నెల 3వ తేదీన పోలింగ్ జరిగింది.ఇవాళ ఓట్లను లెక్కించారు. ఈ ఎన్నిక ఫలితాలపై ఆసక్తి నెలకొంది. చివరి రౌండ్  బీజేపీ, టీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా ఫలితం నెలకొంది.