Asianet News TeluguAsianet News Telugu

బీఆర్ఎస్ , కాంగ్రెస్‌లకు ధీటుగా బీజేపీ ప్రచార వ్యూహం.. దసరా తర్వాత తెలంగాణకు మోడీ, షా, యోగి

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ధీటుగా ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేసింది బీజేపీ. దసరా తర్వాత రాష్ట్రానికి అగ్రనేతలు క్యూ కట్టనున్నారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సీఎంలు యోగి ఆదిత్యనాథ్, హిమంత బిశ్వశర్మలు తెలంగాణలో ప్రచారం నిర్వహిస్తారు. 

bjp booked 4 special helicopters for telangana election campaign ksp
Author
First Published Oct 22, 2023, 4:46 PM IST

తెలంగాణ ఎన్నికల బరిలో బీజేపీ దిగింది. ఎట్టకేలకు సుదీర్ఘ వడపోతల తర్వాత అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది. ఆదివారం 52 మందితో కూడిన లిస్ట్ ప్రకటించింది. త్వరలోనే మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్ధులను ప్రకటించనుంది బీజేపీ. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ధీటుగా ఎన్నికల ప్రచారాన్ని కూడా సిద్ధం చేసింది. దసరా తర్వాత రాష్ట్రానికి అగ్రనేతలు క్యూ కట్టనున్నారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సీఎంలు యోగి ఆదిత్యనాథ్, హిమంత బిశ్వశర్మలతో పాటు కేంద్ర మంత్రులు, ఇతర కీలక నేతలు తెలంగాణలో పర్యటించనున్నారు. 

ఎప్పటిలాగే ప్రధాని మోడీ బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. జాతీయ నేతల పర్యటనకు వీలుగా ఇప్పటికే బీజేపీ 4 హెలికాఫ్టర్లను కూడా బుక్ చేసింది. ఇప్పటి వరకు చప్పగా సాగుతున్న తెలంగాణ ఎన్నికల పోరు.. వచ్చే వారం నుంచి జోరందుకునే అవకాశాలు వున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 

Also Read: గజ్వేల్‌లో టఫ్ ఫైట్!.. ఈటల బలం ఏమిటీ?.. బీజేపీ వ్యూహం ఇదేనా?.. ఇంట్రెస్టింగ్ పాయింట్స్

తెలంగాణలో 5 నుంచి 10 సభల్లో ప్రధాని మోడీ పాల్గొనేలా ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. అలాగే అమిత్ షా, జేపీ నడ్డాలు 15 సభల్లో పాల్గొననున్నారు. ఈ నెల 27న రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు . ఆ వెంటనే 28, 29 తేదీల్లో అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ప్రచారం నిర్వహించనున్నారు. రెండు రోజుల గ్యాప్ తర్వాత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రానున్నారు. అగ్రనేతల రాకతో పార్టీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని భావిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios