హైదరాబాద్: హైదరాబాద్ సిటీలో హెరిటేజ్ బిల్డింగ్ లను కాపాడటంతోపాటు ఆధునిక భవనాలను నిర్మించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్రవంతంగా పనిచేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో సమగ్రమైన హెరిటేజ్ పాలసీ తీసుకువచ్చినట్లు తెలిపారు. 

చారిత్రాత్మకమైన వారసత్వ సంపద కాపాడాలనే ఉద్దేశంతో హెరిటేజ్ చట్టాన్ని తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు. కొంతమంది తెలియని వాళ్లు ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. 

దిల్ కుషా గెస్ట్ హౌస్ కూడా హెరిటేజ్ బిల్డింగ్ అంటూ కూడా మాట్లాడుతున్నారని తెలిపారు. తెలంగాణ వారసత్వ సంపదను ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే గోల్కొండకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు సీఎం కేసీఆర్. 

ఇకపోతే అసెంబ్లీలో మెడికల్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల వయోపరిమితి పెంపుకు సంబంధించి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన బిల్లులకు బీజేపీ, ఎంఐఎం పార్టీ మద్దతు ప్రకటించింది. వారికి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. 

ఈ వార్తలు కూడా చదవండి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం: కీలక బిల్లులు ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్