Asianet News TeluguAsianet News Telugu

బీఆర్ఎస్ లోకి బిత్తిరి సత్తి..! ఇక వారి ఓట్లన్ని కారుకేనా..!?

ముదిరాజ్ సామాజిక వర్గంలో బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున అసహనం వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో ప్రముఖ న్యూస్ యాంకర్ బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి కుమార్ తో ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీకి గల కారణాలు తెలియల్సి ఉంది 

Bithiri Sathi meeting with Minister KTR KRJ
Author
First Published Oct 27, 2023, 12:12 AM IST | Last Updated Oct 27, 2023, 12:12 AM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రోజురోజుకు రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ తమ గెలుపు బావుటాను ఎగరవేయాలని, తమ పార్టీ అధికారంలోకి రావాలని వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. ఈ విషయంలో అధికార బీఆర్ఎస్ మాత్రం దూకుడు మీద ఉంది.  అభ్యర్థుల ప్రకటనతో పాటు ప్రచారంలో కూడా దూసుకుపోతోంది. అయితే.. అభ్యర్థుల ప్రకటన విషయంలో స్వంత పార్టీ నేతలతో పాటు.. ఇతర వర్గాల నుంచి కూడా తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీంతో ఈ విషయంలో కూడా గులాబీ పార్టీ ఆచూతూచీ వ్యవహరిస్తోంది. 

ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున అసహనం వ్యక్తమవుతోంది. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ప్రముఖ న్యూస్ యాంకర్ బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి కుమార్ తో ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. అయితే.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిత్తిరి సత్తితో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

ఎందుకంటే.. ఇటీవల సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ముదిరాజ్ మహాసభలో బిత్తిరి సత్తి ..బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం బిత్తిరి సత్తి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాను ఒకప్పడు బిత్తిరి సత్తిగా మాట్లాడానని.. కానీ ఇప్పుడు ముదిరాజు రవికుమార్‌గా మాట్లాడుతున్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో సీట్ల పంపిణీ విషయంలో ముదిరాజుల నేతలకు రాజకీయంగా తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. 

ముదిరాజులకు టికెట్లు ఇవ్వలేకపోయామని, కానీ వారిని నామినేటెడ్ పోస్టులతో కడుపులో పెట్టుకుని చూస్తామని మంత్రి కేటీఆర్ అంటున్నారని, కానీ నామినేటెడ్ పోస్టులు చాలా సప్పగా ఉంటాయని కీలక వ్యాఖ్యలు చేశారు. తాము (ముదిరాజులం) 60 లక్షల జనాభా ఉందనీ,  115 సీట్లలో ఒక్కటి కూడా ముదిరాజులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.  

ఈ క్రమంలోనే ముదిరాజ్ వర్గంలో ఏర్పడిన అసంతృప్తిని తొలగించేందుకు గులాబీ పార్టీ  భారీ స్కెచే వేసింది. ఈ మేరకు తాజాగా బిత్తిరి సత్తితో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. తాజాగా వీరి భేటీ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బిత్తిరి సత్తి బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకుంటున్నారా?  బిత్తిరి సత్తి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారా? అనే కీలకంగా మారింది.

అయితే.. గత కొంత కాలంగా బిత్తిరి సత్తి ప్రత్యేక్ష రాజకీయాలపై ఆసక్తి చూపుతుండడంతో ఆయనను బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించి.. ఆయనకు పెద్దపీట వేసి.. ముదిరాజ్‌ల్లో ఉన్న  అసంతృప్తిని తొలగించాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. గతంలో బిత్తిరి సత్తితో గులాబీ పార్టీ పాట పాడించగా.. ఈసారి ఎన్నికల్లోనూ ఆయనతో పాట పాడించుకుంటారా? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios