Asianet News TeluguAsianet News Telugu

ఐఎంజీలో బినామీ: చంద్రబాబుపై కేసిఆర్ మరో బాంబు

టుకు నోటు కేసును తవ్వితీస్తూనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మరో బాంబు వేయడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.

Billi Rao episode: KCR eyes on Chandrababu's land allocations

హైదరాబాద్: ఓటుకు నోటు కేసును తవ్వితీస్తూనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మరో బాంబు వేయడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. కాంగ్రెసు, తెలుగుదేశం ప్రభుత్వాల హయాంల్లో తెలంగామ భూముల కబ్జాలపై కేసిఆర్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 

ఇందులో భాగంగానే ఎసిబి, విజిలెన్స్, సిఐడి తదితర దర్యాప్తు సంస్థల ఉన్నతాధికారులతో పాటు న్యాయనిపుణుల తదితరులతో సోమవారం ఓ విడత ఆయన సమీక్ష చేసి, మంగళవారంనాడు మరోసారి సమీక్షకు పూనుకున్నారు. 

చంద్రబాబు నాయుడు 1999 - 2002 మధ్య కాలంలో తెలంగాణ ఆస్తులను విక్రయించిన తీరుపై కూడా విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధింతి పాలక తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధికార పత్రిక ఓ వార్తాకథనాన్ని రాసింది. అందువల్ల చంద్రబాబుపైనే కాకుండా ప్రతిపక్ష కాంగ్రెసు నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, తదితరులపై విచారణకు కేసిఆర్ సిద్ధపడుతున్నట్లు కేసిఆర్ చేస్తున్న ప్రయత్నం నిజమేనని నమ్మడానికి వీలవుతోంది. 

చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ భూములను చౌకగా తనకు సంబంధించినవారికి కట్టబెట్టారనే ఆరోపణలపై ఎసిబి, సిఐడి, విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగాలు కేసులు పెట్టినట్లు తెలుస్తోంది. వాటన్నింటినీ కేసీఆర్ తిరగ తోడేందుకు తగిన ప్రాతిపదికను ఏర్పాటు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. 

ముఖ్యంగా శంషాబాదులో అత్యంత విలువైన 850 ఏకరాల భూమిని ఐఎంజీ అనే సంస్థకు కట్టబెట్టిన వ్యవహారంపై కేసిఆర్ దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. ఎకరానికి రూ.50 వేల చొప్పున ధర కట్టి అప్పగించినట్లు చెబుతున్నారు. ఐఎంజీలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన బిల్లీరావుకు 99.9 శాతం వాటా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాదులోని క్రికెట్ స్టేడియాలను కూడా ఆయనకే కట్టబెట్టినట్లు నమస్తే తెలంగాణ పత్రిక రాసింది. 

రహేజా సంస్థకు కట్టబెట్టిన భూముల వ్యవహారాన్ని కూడా తవ్వి తీస్తారని అంటున్నారు. పోలెపల్లి సెజ్, మాదాపూర్, మణికొండ ఐటి పార్కులు, ఎమ్మార్ ప్రాపర్టీస్ కు భూముల కేటాయింపులపై కూడా విచరాణ జరుపుతారని అంటున్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలక నిర్ణయాలు తీసుకోరాదనే నిబంధనను చంద్రబాబు ఉల్లంఘించి భూములను తనకు కావాల్సిన వారికి కట్టబెట్టారని అంటున్నారు. 

వాటన్నింటిపై సమగ్ర విచారణకు రెండు వేర్వేలు కమిషన్లను ఏర్పాటు చేసి, సత్వరమే పరిష్కరించే దిశగా కేసిఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios