Asianet News TeluguAsianet News Telugu

వనపర్తి : అదుపుతప్పి బైక్‌తో సహా వాగులోకి... ముగ్గురు గల్లంతు

వనపర్తి జిల్లాలో వరద నీటిలో ముగ్గురు గల్లంతయ్యారు. బైక్‌పై కాజ్‌వే దాటుతూ ప్రవాహ వేగానికి ముగ్గురు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

bike was washed away in the flood in wanaparthy
Author
First Published Oct 8, 2022, 6:21 PM IST

వనపర్తి జిల్లాలో వరద నీటిలో ముగ్గురు గల్లంతయ్యారు. మదనాపూర్ సమీపంలో కాజ్‌వేపై ఉద్ధృతంగా నీరు ప్రవహిస్తూ వుంది. అదే సమయంలో బైక్‌పై కాజ్‌వే దాటుతూ ప్రవాహ వేగానికి ముగ్గురు గల్లంతయ్యారు. సరళా సాగర్ ప్రాజెక్ట్ నిండు కుండలా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

ఇకపోతే... కొన్నిరోజులుగా తెలంగాణ‌లో ఎడతెరిపి లేకుండా వ‌ర్షాలు ప‌డుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా, అనేక చెరువులు, జ‌లాశ‌యాలు నీటితో నిండిపోయాయి. కొన్ని ప్రదేశాలలో వాగులు వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. మ‌రో ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షాలు కురుస్తాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేసింది. అక్టోబర్ 12 వరకు ఒక మోస్తరు ఉరుములు మెరుపుల‌తో కూడిన వ‌ర్షంతో పాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌ని వాతావ‌ర‌ణ విభాగం పేర్కొంది. 

ALso REad:తెలంగాణ‌లో మ‌రో ఐదు రోజులు మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు

మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు రాత్రిపూట వర్షం కొనసాగుతుండటంతో నివాసితులను, ముఖ్యంగా యువకులు, వృద్ధులు ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని హెచ్చ‌రించారు. వాగులు పొంగిపొర్లుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ స్తంభాలు, వేలాడుతున్న తీగల చుట్టూ తిరగకుండా ఉండాలని జిల్లా ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు కోరారు. ఏదైనా దురదృష్టకర పరిస్థితులు ఏర్పడితే 100కు ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు. వనపర్తి ప్రాంతంలో గోపాల్‌పేట, బుద్దారం వెళ్లే రహదారులు జలమయం కావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వర్షాలకు కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు నీటిమట్టం గ‌ణ‌నీయంగా పెరిగింది.

వ‌ర్షాలు ప‌డుతుండ‌టంతో శిథిలావస్థలో ఉన్న భవనాల్లోని నివాసితులు ముందుజాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెంలోని అంకంపాలెంలో అత్యధికంగా 42 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెంలోని అశ్వారావుపేటలో 15.8 మిల్లీ మీట‌ర్లు, నల్గొండలోని జునూట్లలో 22.3 మిల్లీ మీట‌ర్ల వ‌ర్షపాతం నమోదైంది. భారత వాతావరణ శాఖ (IMD) శుక్రవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్ర‌క‌ట‌న‌లో శనివారం తేలికపాటి నుండి మోస్తరుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఏజెన్సీ ప్రకారం, రాబోయే ఐదు రోజులలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు లేదా ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios