కుటుంబానికి అండగా వుండేందుకు కూరగాయలమ్ముకుంటున్న ఓ మహిళపై కన్నేసిన ఓ బిహారీ ఆమె అశ్లీల ఫోటోలను కాల్ గర్ల్ పేరిట సోషల్ మీడియాలో పోస్ట్ చేసాాడు.

హైదరాబాద్: కుటుంబానికి ఆసరగా వుండేందుకు కూరగాయల వ్యాపారం చేసుకుంటున్న వివాహితపై కన్నేసాడో దుర్మార్గుడు. ఆమె ఫోటోను మార్ఫింగ్ చేసి అశ్లీలంగా మార్చి కాల్ గర్ల్ గా పేర్కొంటూ సోషల్ మీడియాలో పెట్టాడు. అంతేకాకుండా మహిళ భర్తకు, కుటుంబసభ్యులకు ఆమె అశ్లీల ఫోటోలో పెట్టి వేదిస్తున్న నిందితున్ని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసారు. 

వివరాల్లోకి వెళితే... తెలంగాణ రాజధాని హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ సాదుపల్లి ప్రాంతంలో ఓ వివాహిత కూరగాయల వ్యాపారం చేసేంది. మార్కెట్ నుండి కూరగాయలు తీసుకువచ్చి స్థానికంగా ఓ చిన్నపాటి దుకాణం పెట్టుకుని విక్రయించేది. ఇలా కుటుంబ పోషణలో భర్తకు సహాయపడేది. 

అయితే బిహార్ రాష్ట్రానికి చెందిన మహ్మద్ ఇజ్రాయిల్(28) ఉపాధి నిమిత్తం తెలంగాణకు వచ్చి అబ్దుల్లాపూర్ మెట్ లో నివాసముండేవాడు. ప్రతిరోజూ సదరు మహిళ నిర్వహించే కూరగాయల షాప్ కు వెళ్లి కావాల్సినవి తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలోనే వివాహితపై కన్నేసిన అతడు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఎలాగోలా ఆమె ఫోన్ నెంబర్ తో పాటు ఫోటోలను సేకరించాడు. 

మహిళ ఫోన్ నెంబర్ కు వీడియో కాల్ చేస్తూ మాట్లాడాలని వేధించడం ప్రారంభించాడు. ఇలాంటివి తనకు నచ్చవని సదరు మహిళ ఇజ్రాయిల్ ను హెచ్చరించింది. అయినప్పటికి అతడి తీరులో ఏమాత్రం మార్పు రాలేదు కదా ఆమెపై పగను పెంచుకున్నాడు. 

ముందుగానే వివాహిత ఫోటోలను సేకరించిన ఇజ్రాయిల్ వాటిని మార్ఫింగ్ ద్వారా అశ్లీలంగా తయారుచేసాడు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో కాల్ గర్ల్ గా పేర్కొంటూ పోస్ట్ చేసాడు. అంతటితో ఆగకుండా ఆ ఫోటోలోను మహిళ భర్తతో పాటు కుటుంబసభ్యులుకు వాట్సాఫ్ చేసాడు. వివిధ నెంబర్ల ద్వారా ఫోన్ చేసి వివాహిత గురించి ఆమె భర్తకు చెడుగా చెప్పడం, అసభ్యంగా దూషించాడు. దీంతో విసిగిపోయిన భార్యాభర్తలు పోలీసులకు ఫిర్యాదు చేసారు. 

బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేసి ఇజ్రాయిల్ జాడను గుర్తించారు. సాంకేతిక ఆధారాలను సేకరించి నిందితుడు ఇజ్రాయిల్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వివాహిత అశ్లీల ఫోటోలతో కూడిన మొబైల్ ను స్వాధీనం చేసుకున్నారు.