బిగ్ బాస్ 2: టీఆర్ఎస్ మద్దతు, ఎవరీ దీప్తి సునయన?

Bigg Boss 2: TRS supports Sunayana
Highlights

బిగ్ బాస్ 2 పార్టిసిపెంట్ కోసం తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నాయకులు రంగంలోకి దిగారు.

హైదరాబాద్: బిగ్ బాస్ 2 పార్టిసిపెంట్ కోసం తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నాయకులు రంగంలోకి దిగారు. నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 2లో పాల్గొంటున్న దీప్తి సునయనకు మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు నాయకులు హైదరాబాద్ శివార్లలో ఫ్లెక్సీలు కట్టారు. 
 
దీప్తి సునయన హైదరాబాద్ అమ్మాయి. సోషల్ మీడియాలో చాలా  చురుగ్గా ఉంటుంది. ఈ అమ్మాయి  బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టింది. ఎలిమినేట్ కాకుండా ఓటేసి సునయనను కాపాడుకుందామని హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు సందడి చేస్తున్నాయి.
 
దీప్తి సునయనకు బలమైన సపోర్ట్ కావాలని భావించిన ఇద్దరు రాజకీయ నాయకులు ఫ్లెక్సీలు కట్టి రంగంలోకి దిగారు. ఇబ్రహీంపట్నంకు చెందిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆ మండల పార్టీ అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి ఆమెకు మద్దతు ఇవ్వాలని ప్రచారం సాగిస్తున్నారు. 

ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ, మన ప్రాంతవాసి దీప్తి సునయనకు ఓటేయాలని కోరుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ అమ్మాయికి సపోర్ట్ చేయడానికి ఈ నెంబర్‌కి మిస్ కాల్ ఇవ్వండంటూ ఓ నెంబర్ కూడా ఇచ్చారు. 
 
బిగ్ బాస్ గత సీజన్‌లో కూడా శివబాలాజీకి పవన్ ఫ్యాన్స్ ఇచ్చిన మద్దతు ఇచ్చారు. దాంతో ఆయనే విజేతగా నిలిచారు.

loader