Asianet News TeluguAsianet News Telugu

సీనియర్లంతా బస్సు యాత్ర నిర్వహించాలి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

రానున్న రోజుల్లో ఏ రకమైన వ్యూహంతో వెళ్లాలనే దానిపై  ఇవాళ  తన నివాసంలో  పార్టీ నేతలంతా సమావేశం కానున్నట్టుగా  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు

Bhuvanagiri MP Komatireddy Venkat Reddy Suggested  To   Congress To Conduct  Bus Yatra lns
Author
First Published Jul 19, 2023, 12:50 PM IST

హైదరాబాద్: రానున్న మూడు మాసాల్లో తెలంగాణలో ఎన్నికలు ఉన్నందున  బస్సు యాత్ర నిర్వహించాలని  పార్టీ నేతలకు  సూచించనున్నట్టుగా భువనగిరి ఎంపీ  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  చెప్పారు.

బుధవారంనాడు  భువనగిరి ఎంపీ  కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి నివాసంలో  కాంగ్రెస్ పార్టీ సీనియర్లు  సమావేశం కానున్నారు.ఈ సమావేశానికి ముందు  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.  ఎన్నికలకు  సమయం తక్కువగా ఉన్నందున  ప్రజల్లోనే పార్టీ నేతలంతా ఉండాలంటే ఏం చేయాలనే దానిపై  చర్చించనున్నట్టుగా  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  చెప్పారు. రాష్ట్రానికి చెందిన పార్టీ ముఖ్యులను సమావేశానికి పిలిచినట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.  కాంగ్రెస్ పార్టీలో చేరికలు,  ఇతర అంశాలపై  చర్చించనున్నట్టుగా  చెప్పారు. ఎన్నికలకు  రోడ్ మ్యాప్ పై ఈ సమావేశంలో  చర్చించనున్నట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరికలపై  పార్టీ రాష్ట్ర ఇంచార్జీ  మాణిక్ రావ్ ఠాక్రే  మార్గనిర్ధేశం  చేస్తారని  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. 

also read:నేడు కోమటిరెడ్డి నివాసంలో కాంగ్రెస్ నేతల భేటీ: బస్సు యాత్ర, చేరికలపై చర్చ

  తాను  సబ్ స్టేషన్ వద్దకు వెళ్లి 9 గంటల పాటు  ఉచిత విద్యుత్ ను  అందించడం లేదనే విషయాన్ని బయట పెట్టడంతో  రాష్ట్రవ్యాప్తంగా  పలు  పార్టీల నేతలు తనకు  ఫోన్లు చేస్తున్నారన్నారు.  ఆ తర్వాతే  వ్యవసాయానికి  9 గంటల పాటు విద్యుత్ ను అందిస్తున్నట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  తెలిపారు.

 

 


 

Follow Us:
Download App:
  • android
  • ios