భువనగిరి ఎంపీకి కాంగ్రెస్ షోకాజ్: రిప్లై ఇచ్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ  నాయకత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసుకు భువనగరి  ఎంపీ కోమటిరెడ్డి వెంకట్  రెడ్డి సమాధానం ఇచ్చారు. ఈ  నెల 4వ తేదీన కోమటిరెడ్డి వెంకట్  రెడ్డికి కాంగ్రెస్  పార్టీ  రెండోసారి షోకాజ్ నోటీసును పంపింది. 

Bhuvanagiri MP Komatireddy Venkat Reddy Replies To Congress Show cause Notice

హైదరాబాద్:భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం  పంపిన షోకాజ్ నోటీసుకు సమాధానం   పంపారు. ఈ  సమాధానంపై ఎఐసీసీ  క్రమశిక్షణ  సంఘం  ఎలాంటి  నిర్ణయం తీసుకొంటుందోననే ఆసక్తి  సర్వత్రా  నెలకొంది.

కాంగ్రెస్   పార్టీ క్రమశిక్షణ సంఘం  ఈ నెల 4వ  తేదీన కోమటిరెడ్డి వెంకట్  రెడ్డికి  రెండోసారి షోకాజ్ నోటీసును జారీ  చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 22న కోమటిరెడ్డి వెంకట్  రెడ్డికి షోకాజ్ నోటీస్ జారీ  చేశారు. అయితే ఈ  షోకాజ్ అందలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కార్యాలయం  కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి  సమాచారం ఇవ్వడంతో  ఈ  నెల 4 వ తేదీన మరో షోకాజ్  నోటీసును జారీ చేసింది  ఆ పార్టీ  క్రమశిక్షణ  సంఘం.

మునుగోడు ఉప ఎన్నికను  పురస్కరించుకొని బీజేపీకి ఓటు చేయాలని  ఓ కార్యకర్తతో కోమటిరెడ్డి  వెంకట్  రెడ్డి  ఫోన్  చేసినట్టుగా  ఓ ఆడియో వెలుగు చూసింది. అంతేకాదు అస్ట్రేలియా పర్యటనలో ఉన్న సమయంలో మునుగోడులో కాంగ్రెస్ విజయం  సాధించదని  ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను  కాంగ్రెస్  పార్టీ  సీరియస్ గా తీసుకుంది.  ఈ వ్యాఖ్యల  విషయమై కాంగ్రెస్ పార్టీ సీనియర్లు పార్టీ రాష్ట్ర  వ్యవహరాల  ఇంచార్జీ మాణికం ఠాగూర్  దృష్టికి తీసుకువెళ్లారు. మాణికం ఠాగూర్ ఈ విషయాన్ని  కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘానికి నివేదించారు. దీంతో ఎఐసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మెన్ తారిఖ్ అన్వర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి  గత నెల 22న షోకాజ్ నోటీసును  జారీ చేసింది. ఈ నోటీసుకు  కోమటిరెడ్డి వెంకట్  రెడ్డి సమాధానం ఇవ్వలేదు. దీంతో ఈ  నెల 4 వ తేదీన మరో నోటీసును  పంపారు. ఈ నోటీసుకు రెండు రోజుల క్రితమే  కోమటిరెడ్డి వెంకట్  రెడ్డి రిప్లై ఇచ్చారు. షోకాజ్ నోటీసుపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎలా  స్పందిస్తుందో చూడాలి.

also read:మొదటి షోకాజ్‌కి నో రిప్లయ్: మరోసారి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసు

ఇదిలా  ఉంటే కాంగ్రెస్  పార్టీ  నాయకత్వం ఈ విషయమై సీరియస్ గా  ఉంది.  లక్షణ రేఖ ఎవరూ దాటినా కూడా వారిపై చర్యలు తప్పవని  మాజీ కేంద్ర మత్రి  జైరాం రమేష్ తేల్చిచెప్పారు. కోమటిరెడ్డి వెంకట్  రెడ్డికి నోటీసులు  ఇచ్చిన విషయాన్ని  ఆయన  మీడియా సమావేశంలో గుర్తు చేశారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios