మొదటి షోకాజ్‌కి నో రిప్లయ్: మరోసారి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసు
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ శుక్రవారంనాడు రెండో సారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 7వ తేదీలోపుగా సమాధానం ఇవ్వాలని ఆ నోటీసులో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం ఆదేశించింది.
హైదరాబాద్:భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం శుక్రవారంనాడునోటీసులు జారీ చేసింది. ఈ నెల 7వ తేదీలోపుగా సమాధానం ఇవ్వాలని ఆ నోటీసులో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం ఆదేశించింది.
గత మాసంలో ఇచ్చిన షోకాజ్ నోటీసుకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమాధానం ఇవ్వలేదు. అస్ట్రేలియా పర్యటనలో ఉన్నందున ఈ షోకాజ్ నోటీసు అందలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కార్యాలయవర్గాలు కాంగ్రెస్ పార్టీకి సమాచారం ఇవ్వడంతో మరోసారి షోకాజ్ నోటీసు అందించారు.
గత నెల 22న కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం నుండి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసును పంపారు. ఆ సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అస్ల్రేలియా పర్యటనలో ఉన్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిన మరునాడే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అస్ట్రేలియా నుండి హైద్రాబాద్ కు తిరిగి వచ్చారు. ఈ నెల 1వ తేదీతో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమాధానం ఇవ్వాలి. కానీ ఆయన మాత్రం సమాధానం ఇవ్వలేదు. షోకాజ్ నోటీసు అందలేదని కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కార్యాలయం సమాచారం ఇచ్చిందని సమాచారం. దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ క్రమ:శిక్షణ సంఘం ఇవాళ మరో నోటీసును జారీ చేసింది.
మునుగోడు ఉప ఎన్నిక సమయంలో తన అనుచరరులకు ఫోన్ చేసి ఈ దఫా బీజేపీకిఓటు వేయాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారం చేసిన ఆడియో ఒకటి బయటకు వచ్చింది.మరో వైపు అస్ట్రేలియా టూర్ లో ఉన్న సమయంలో మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలవదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడ కలకలం రేపాయి. ఈ రెండు అంశాలను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేసింది.
alsoread:అస్ట్రేలియా నుండి హైద్రాబాద్‌కి కోమటిరెడ్డి: షోకాజ్ పై ఎలా స్పందిస్తారో?
పార్టీని నష్టపర్చేలా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ సీనియర్లు ఆగ్రహంతో ఉన్నారు.పార్టీకి నష్టం చేసేలా వ్యవహరించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆడియోసంభాషణతో పాటు అస్ట్రేలియాలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ పార్టీ అధిష్టానానికి వివరించారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సోకాజ్ నోటీసు జారీ చేసింది.