ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన నిరాశ పరిచిందని భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. నిరుద్యోగ భృతిపై కేసీఆర్ సర్కార్ ఏం సమాధానం చెబుతుందని ఆయన ప్రశ్నించారు.

హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై సీఎం ేసీఆర్ ప్రకటన నిరాశ పరిచిందని భువనగిరి ఎంపీ Komatireddy Venkat Reddy చెప్పారు.

80 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలంగాణ సీఎం KCR అసెంబ్లీ లో బుధవారం నాడు ప్రకటించారు. ఈ విషయమై హైద్రాబాద్ లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు.Government jobs ఖాళీల విషయంలో బిశ్వాల్ కమిటీ రిపోర్టు గురించి వెంకట్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రంలో 1.91 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలున్నాయని ,బిశ్వాల్ కమిటీ రిపోర్టు చెప్పిందని ఎంపీ ప్రస్తావించారు. ప్రస్తుతం Telangana సీఎం రాష్ట్రంలో 91 వేల ప్రభుత్వ ఉద్యోగ పోస్టులే ఖాళీగా ఉన్నాయని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు.

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేసే వరకు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని కేసీఆర్ సర్కార్ ప్రకటించిన విషయాన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్తు చేశారు. అయితే నిరుద్యోగ భృతి ఏమైందని ఆయన ప్రశ్నించారు.నిరుద్యోగ భృతి విషయమై కేసీఆర్ నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

త్వరలోనే రాష్ట్రంలోని 80,039 ప్రభుత్వ ఉద్యోగ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుండి ఇప్పటి వరకు 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ సీఎం KCR బుధవారం నాడు Telangana Assembly వేదికగా కీలక ప్రకటన చేశారు.

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు 91,147 ఉన్నాయని సీఎం చెప్పారు. అయితే ఇందులో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించగా మిగిలిన 80,039 ఉద్యోగ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

పోలీస్ శాఖలో 18,334, విద్యాశాఖలో 13,086, వైద్య, ఆరోగ్యశాఖలో 12,755, ఉన్నత విద్యా శాఖలో 7,878, రెవిన్యూ శాఖలో 3,560, బీసీ సంక్షేమ శాఖలో 4,311, గిరిజన సంక్షేమ శాఖలో 2,399, సాగునీటి శాఖలో 2,692 పోస్టులను భర్తీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఇవాళ్టి నుండే ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. 

మైనారిటీ శాఖలో 1,825,అటవీశాఖలో 1598,పంచాయితీరాజ్ శాఖలో 1455,కార్మిక శాఖలో 1221,ఫైనాన్స్ శాఖలో 1146, మున్సిఫల్ శాఖలో 859, వ్యవసాయ శాఖలో 801, రవాణ శాఖలో 563 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీఎం చెప్పారు.న్యాయ శాఖలో 386,సాధారణ పరిపాలన శాఖలో 343,పరిశ్రమల శాఖలో 233, పర్యాటక శాఖలో 184, సచివాలయం, హెచ్ఓడీ, వర్శిటీల్లో 8,147 ఖాళీలున్నాయని సీఎం వివరించారు.

ఇక గ్రూప్- 1లో 503,గ్రూపు 2లో 582, గ్రూప్ 3లో1373, గ్రూప్ 4 లో9168, జిల్లా స్ధాయి లో 39,829,జోనల్ స్థాయిలో 18866,మల్టీజోన్ లో13170, అదర్ కేటగిరిలో వర్సిటీలలో 8174 భర్తీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. 

ప్రతి ఏటా ఉద్యోగ ఖాళీలను గుర్తించి ఉద్యోగ నియమాకాలను చేపడుతామని కేసీఆర్ చెప్పారు. పోలీస్ శాఖ మినహాయించి అన్ని ఉద్యోగాలకు అభ్యర్ధుల వయో పరిమితిని పదేళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకొన్నామని కేసీఆర్ తెలిపారు. ఓసీలకు 44 ఏళ్లు ,ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్లకు వయో పరిమితి పెంచుతున్నట్టుగా కేసీఆర్ తెలిపారు.